‘చంద్రబాబు అన్యాయం చేశారు.. జగన్ ని కలుస్తాం’

Published : May 28, 2019, 03:57 PM IST
‘చంద్రబాబు అన్యాయం చేశారు.. జగన్ ని కలుస్తాం’

సారాంశం

గత ప్రభుత్వ హయాంలో తమకు తీరని అన్యాయం జరిగిందని మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు అన్నారు. 

గత ప్రభుత్వ హయాంలో తమకు తీరని అన్యాయం జరిగిందని మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు అన్నారు. తమ మాలల ప్రాతినిథ్యం కోసం తాము త్వరలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలుస్తానని చెప్పారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 

వైసీపీ విజయం సాధించడంలో తమ మాలలు కీలక పాత్ర పోషించారని ఆయన చెప్పారు. వర్గీకరణ కిరీటదారి చంద్రబాబును ఓడించేం దుకు మాలలు రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. నలుగురు మాల నాయకులకు ఎస్సీ కార్పొరేషన్‌, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌, ఎస్సీ లెజిస్లేటివ్‌ కమి టీ, క్రిస్టియన్‌ కార్పొరేషన్‌ పదవులు ఇచ్చి ఉత్సవ విగ్రహాలుగా చంద్ర బాబు నాయుడు మాలలకు తీవ్ర అన్యాయంచేశారని ఆరోపించారు. 

మాజీ మంత్రి నక్కా ఆనందబాబు 13 జిల్లాల్లో సగం పర్యటించలేదని, ప్రకాశం జిల్లాలో సమీక్ష జరపలేని దుస్థితితోనే ఓడిపోయారని ఆయన తెలిపారు. నామినెట్‌డ్‌ పోస్టుల్లో కూడా మాలలకు ప్రాధాన్యం ఇవ్వాల ని నూతనముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని కోరనున్నట్లు ఆయన పేర్కొ న్నారు.

PREV
click me!

Recommended Stories

Constable Success Stories:వీళ్ళ ఎమోషనల్ మాటలు చూస్తే కన్నీళ్లు ఆగవు | Police | Asianet News Telugu
Bhumana Karunakar Reddy: దేవుడ్ని దోచి, ఒబెరాయ్ కు కట్టబెడుతున్న బాబు ప్రభుత్వం| Asianet News Telugu