పింఛన్ సొమ్ము మీద కన్ను.. దాడి అంటూ దొంగవేషాలు...

Published : Oct 02, 2020, 11:05 AM IST
పింఛన్ సొమ్ము మీద కన్ను.. దాడి అంటూ దొంగవేషాలు...

సారాంశం

అనంతపురం జిల్లా మడకశిరలో వలంటీర్ పై దోపిడీ దొంగలు దాడి చేసిన ఘటనలో ఊహించని ట్విస్ట్ బయటపడింది. పింఛన్ డబ్బు కోసం వలంటీర్ వీరప్ప కట్టుకథ అల్లాడని తేలింది. దీంతో పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. 

అనంతపురం జిల్లా మడకశిరలో వలంటీర్ పై దోపిడీ దొంగలు దాడి చేసిన ఘటనలో ఊహించని ట్విస్ట్ బయటపడింది. పింఛన్ డబ్బు కోసం వలంటీర్ వీరప్ప కట్టుకథ అల్లాడని తేలింది. దీంతో పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. 

జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు వలంటీర్‌ వీరప్పను విధుల నుంచి తొలగించాలని కమిషనర్‌ నాగార్జునకు ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్‌ పింఛన్‌ డబ్బు కోసం  తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి రూ.43,500 దోచుకెళ్లారంటూ వీరప్ప కట్టుకథ అల్లాడు.   పట్టణంలోని 3వ వార్డుకు చెందిన శివాపురం పరిధిలో వార్డు వలంటీర్‌గా  పని చేస్తున్నాడు వీరప్ప. 

గురువారం 1వ తేదీ కావడంతో  శివాపురం కాలనీ పరిధిలోని కొండ ప్రాంతంలో ఉన్న లబ్ధిదారులకు పింఛన్‌ పంపిణీ చేయడానికి దాదాపు రూ.43,500  జేబులో పెట్టుకుని ఇంటి నుండి బయలుదేరాడు. అయితే ఆ డబ్బును ఎలాగైనా కాజేయాలనుకున్నాడు. అందుకే దాడి చేశారని కథ అల్లాడు.. నిజమేననుకొని స్థానికులు వలంటీర్‌ను చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు.  

వలంటీర్ పై దోపిడీ దొంగల దాడి.. ఆసరా పింఛన్ల సొమ్ము మాయం

విషయం తెలియగానే స్థానిక సీఐ రాజేంద్రప్రసాద్, ఎస్‌ఐ రాజేష్‌, మున్సిపల్‌ కమిషనర్‌ నాగార్జున సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వీరప్పను విచారించగా డబ్బు కోసమే కట్టు కథ అల్లాడని, అతనిపై ఎలాంటి దాడి జరగలేదని తేలింది. 

PREV
click me!

Recommended Stories

Weather Update: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం.. 15 జిల్లాలకు హై అలర్ట్.. అక్కడ తుపాను గండం
అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu