అమరావతిలో అంతర్జాతీయ విద్యాసంస్థలు: మాల‌క్ష్మి గ్రూప్ సీఈవో

By Arun Kumar PFirst Published Feb 6, 2019, 9:13 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు మాల‌క్ష్మి గ్రూప్ సీఈవో సందీప్ మండవ తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం నుండి ఈ విద్యాసంస్థలను ప్రారంభించనున్నటలు వెల్లడించారు. ప్రస్తుతం రూ.80 కోట్ల వ్యయంతో విద్యాసంస్థకు సంబంధించిన  భవనాల నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ విద్యాసంస్థల ద్వారా నూతన విద్యా విధానాన్ని విద్యార్థులకు పరిచయం చేస్తామని...కేంబ్రిడ్జ్ సిలబస్ తో బోధించటం జరుగుతుందని సందీప్ తెలిపారు. 

అంతర్జాతీయ స్థాయిలో నిర్మితమవుతున్న అమరావతి నగరంలో కొత్తగా తమ వెంచర్ల నిర్మాణం ప్రారంభించిడం ఆనందంగా వుందన్నారు. ఈ విధంగా రాజధాని నిర్మాణంలో తమ వంతు భాగస్వామ్యం అందిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు లోకేశ్, నారాయణలు రాజధాని నిర్మాణం కోసం ఎంతగానో కష్టపడుతున్నారని సందీప్ పేర్కొన్నారు. 

ఇవాళ మాలక్ష్మి సంస్థ ఆద్వర్యంలో అమరావతిలో ఏర్పాటుచేస్తున్న కొత్త వెంచర్ కు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ గౌతం స‌వాంగ్, పర్యాటక శాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనాతో పాటు ఈ సంస్థ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ మొట్టమొదట రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు వచ్చిన మాలక్ష్మి గ్రూప్ ను అభినందించారు. 
 
click me!