
శ్రీకాళహస్తి : పెళ్లాం బిడ్డలను కాదని ప్రేమించిన యువతితో పరారయ్యాడు వివాహితుడు. కొంతకాలానికి ఇరు గ్రామాల సమీపంలో ఓ యువతి మృతదేహాం గుర్తుపట్టలేని స్థితిలో బయటపడగా అందరూ కనిపించకుండా పోయిన యువతి శవమేనని భావించారు. మరికొద్దిరోజులకు ఓ యువకుడి మృతదేహం లభించగా పారిపోయన యువకుడి శవమేనని భావించారు. ఇలా ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుందని ఇరువురి కుటుంబసభ్యులు, ఇరు గ్రామాల ప్రజలు నిర్దారణకు వచ్చాయి. అయితే తాజాగా ఈ ప్రేమ జంట తాము ప్రాణాలతో క్షేమంగా వున్నామంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో కనిపించడం తిరుపతి జిల్లాలో సంచలనంగా మారింది.
పోలీసులు, బాధిత కుటుంబాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాళహస్తి ఎన్టీఆర్ నగర్ కు చెందని చంద్రిక, అదే మండలం రామాపురానికి చెందిన చంద్రశేఖర్ ప్రేమించుకున్నారు. వీరిద్దరూ ప్రేమలోపడే సమయానికే చంద్రశేఖర్ కు పెళ్లయి భార్యాపిల్లలు వున్నారు. అయినా చంద్రిక అతడిని ఇష్టపడింది. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించరని ... వాళ్లను ఎదిరించి అక్కడే కలిసి బ్రతకలేమని గుర్తించిన ప్రేమ జంట ఈ ఏడాది ఆరంభంలో (జనవరి) ఇళ్లు వదిలి పరారయ్యారు. ఇరు కుటుంబాలు ఎంత వెతికినా ఆఛూకీ లభించకపోవడంతో కొంతకాలానికి ఈ విషయాన్ని మరిచిపోయారు.
Read more నెల్లూరులో దారుణం ... తల్లిదండ్రుల హత్యకు సుఫారీ ఇచ్చిన కన్నకొడుకు
అయితే ఇటీవల తెలుగుగంగ కాల్వలో ఓ యువతి మృతదేహం గుర్తించలేని స్థితిలో లభించగా పుట్టుమచ్చలు, ఇతర ఆనవాళ్ల ఆదారంగా అది తమ కూతురేనని చంద్రిక తల్లిదండ్రులు భావించారు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఓ యువకుడి మృతదేహం కూడా గుర్తించలేని స్థితిలో లభించగా అది చంద్రశేఖర్ దే అని భావించారు. ఇలా ప్రేమజంట ఆత్మహత్య చేసుకుని వుంటారని ఇరు కుటుంబాలతో పాటు గ్రామస్తులు కూడా నిర్దారించుకున్నారు.
అయితే తాజాగా ఈ ప్రేమ జంట తాము క్షేమంగానే వున్నామంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడం సంచలనంగా మారింది. త్వరలోనే అత్తవారిల్లు రామాపురానికి వస్తామని చంద్రిక తెలపింది. తాము ఆత్మహత్య చేసుకోలేదని... బ్రతికే వున్నామంటూ వీడియో ద్వారా తెలిపారు. దీంతో ఇటీవల లభించిన మృతదేహాలు ఎవరివో అన్న సందిగ్దంలో పడ్డారు. ఇప్పటికే డిఎన్ఏ పరీక్షలు చేయించామని... ఆ రిపోర్ట్ వస్తే మృతులు ఎవరో తేలుతుందని పోలీసులు తెలిపారు.