ప్రియుడి అపార్ట్ మెంట్ పై నుండి దూకి... ప్రియురాలు ఆత్మహత్య

Published : Jul 30, 2020, 08:18 PM ISTUpdated : Jul 30, 2020, 08:21 PM IST
ప్రియుడి అపార్ట్ మెంట్ పై నుండి దూకి... ప్రియురాలు ఆత్మహత్య

సారాంశం

ప్రేమించిన వాడితో గొడవపడి  ఓ యువతి ఐందస్తుల భవనంపై నుండి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద సంఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. 

పెందుర్తి: ప్రేమించిన వాడితో గొడవపడి  ఓ యువతి ఐందస్తుల భవనంపై నుండి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద సంఘటన విశాఖ జిల్లా పెందుర్తిలో  చోటుచేసుకుంది. ప్రియుడు నివాసముండే అపార్టుమెంట్ పై నుండే యువతి దూకి బలవన్మరణానికి పాల్పడింది.

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఒరిస్సా రాష్ట్రం రాయగడ్ ప్రాంతానికి చెందిన కావేటి వైష్ణవి(22) విశాఖలో ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తోంది. ఈమెకు చినముషిని వాడ ప్రాంతానికి చెందిన షణ్ముక తేజతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వీరి మద్య కొంతకాలం సాఫీగా సాగిన ప్రేమాయణం  రాను రాను గొడవలకు దారితీసింది. 

ఈ క్రమంలోనే వైష్ణవి గురువారం మధ్యాహ్నం తన ప్రియుడు నివసించే అపార్ట్మెంట్ కు వచ్చింది. అయితే మళ్లీ వీరిద్దరి మధ్య గొడవ జరిగడంతో క్షణికావేశంలో వైష్ణవి దారుణానికి పాల్పడింది. అదే అపార్ట్మెంట్ లోని ఐదో అంతస్తుపై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. 

ఈ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకున్న పెందుర్తి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యువతి ప్రియుడిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. 
 

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?