మోదీ, జగన్ లకు పూర్తి సినిమా చూపిస్తా: లోకేష్ వార్నింగ్

Published : Jan 11, 2019, 04:32 PM IST
మోదీ, జగన్ లకు పూర్తి సినిమా చూపిస్తా: లోకేష్ వార్నింగ్

సారాంశం

ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. మోదీ మోనార్క్‌లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీబీఐ, ఆర్బీఐలాంటి వ్యవస్థలను భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. 

అమరావతి: ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. మోదీ మోనార్క్‌లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీబీఐ, ఆర్బీఐలాంటి వ్యవస్థలను భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. 

ఏపీ బీజేపీ నేతలకు దమ్ముంటే రాష్ట్ర సమస్యలపై మోదీని నిలదీయాలని సవాల్ విసిరారు. మోదీ, జగన్‌ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదాపై జగన్‌ ఏనాడైనా మోదీని నిలదీశారా? అని మంత్రి లోకేష్‌ ప్రశ్నించారు. 

ప్రజాసంకల్ప యాత్ర ముగింపు సభలో జగన్ మోదీపై ఒక్క విమర్శ చేయలేదన్నారు. తనపై ఉన్న కేసులను మాఫీ చేయించుకునేందుకు జగన్ మోదీని వెనకేసుకు వస్తున్నట్లు తెలిపారు. 

జగన్ కేసులను నీరుగార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మొన్న కర్ణాటకలో బీజేపీ చూసింది ట్రైలర్ మాత్రమేనన్నారు. రాబోయే రోజుల్లో ఏపీలో పూర్తి సినిమా చూపిస్తామన్నారు మంత్రి లోకేష్.  
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం