టీఆర్ఎస్ ఫిర్యాదు: ముగ్గురు ఎమ్మెల్సీలపై విచారణ

By narsimha lodeFirst Published Jan 11, 2019, 7:00 PM IST
Highlights

పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ  టీఆర్ఎస్ ఇచ్చిన పిటిషన్‌పై శాసనమండలి ఛైర్మెన్ స్వామిగౌడ్  శుక్రవారం నాడు విచారణను ప్రారంభించారు. 


హైదరాబాద్: పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ  టీఆర్ఎస్ ఇచ్చిన పిటిషన్‌పై శాసనమండలి ఛైర్మెన్ స్వామిగౌడ్  శుక్రవారం నాడు విచారణను ప్రారంభించారు. 

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో   టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు రాములు నాయక్, భూపతిరెడ్డి, యాదవరెడ్డిలు  కాంగ్రెస్ పార్టీలో చేరారు.కాంగ్రెస్ పార్టీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గత మాసంలో ఆ పార్టీ శాసనమండలి ఛైర్మెన్ స్వామిగౌడ్‌కు టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది.

ఈ ఫిర్యాదు మేరకు  రాములు నాయక్‌ విచారణను  శాసనమండలి ఛైర్మెన్  స్వామిగౌడ్ విచారించారు. తీర్పును రిజర్వ్ చేశారు. రేపు యాదవరెడ్డి, భూపతిరెడ్డిలపై ఇచ్చిన ఫిర్యాదులపై విచారణను స్వామి గౌడ్  చేపట్టనున్నారు.
 

click me!