ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ రాజీలేని వైఖరి: కేవీపీ

Published : Sep 23, 2018, 12:01 PM IST
ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ రాజీలేని వైఖరి: కేవీపీ

సారాంశం

 ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపి రామచంద్రారావు ఆదివారం నాడు బహిరంగ లేఖ రాశారు. 


అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపి రామచంద్రారావు ఆదివారం నాడు బహిరంగ లేఖ రాశారు.  ఏపీకి ప్రత్యేక హోదా కావాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుండో  పోరాటం చేస్తోందని ఆయన ఆ లేఖలో గుర్తు చేశారు.

 ప్రత్యేక హోదా వద్దు అంటూ  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తొలుత వ్యతిరేకించారని ఆయన చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అని చంద్రబాబునాయుడు  అసెంబ్లీలో  తీర్మానం చేసిన  విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ప్రత్యేక హోదా కోసం పోరాడిన వారిపై కేసులు  పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్యాకేజీకి ఒప్పుకొని సన్మానాలు కూడ చేయించుకొన్నారని ఆ లేఖలో గుర్తు చేసుకొన్నారు.  ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కట్టుబడే ఉందని  కేవీపీ లేఖలో పేర్కొన్నారు.


 

PREV
click me!

Recommended Stories

శ్రీవారి రూ. 300 టికెట్లు ఎందుకు దొర‌క‌డం లేదు, ఆన్‌లైన్ బుకింగ్‌లో స‌మ‌స్య ఏంటి.?
Laddu ATM: ఈ ఏటీఎం నుంచి లడ్డూలు వస్తాయి.. ఎక్క‌డుంది, ఎలా ప‌ని చేస్తుందంటే.?