వెనక్కి తగ్గిన కుటుంబరావు.. వైసీపీనేత కు క్షమాపణలు

Published : Apr 23, 2019, 01:00 PM IST
వెనక్కి తగ్గిన కుటుంబరావు.. వైసీపీనేత కు క్షమాపణలు

సారాంశం

ఏపీ ప్రణాళికా మండలి ఉపాధ్యక్షులు కుటుంబరావు.. వెనక్కి తగ్గారు. ఆయన తాజాగా వైసీపీ నేతకు క్షమాపణలు తెలిపారు.

ఏపీ ప్రణాళికా మండలి ఉపాధ్యక్షులు కుటుంబరావు.. వెనక్కి తగ్గారు. ఆయన తాజాగా వైసీపీ నేతకు క్షమాపణలు తెలిపారు.   సోమవారం కుటుంబరావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే... ఆ వ్యాఖ్యలు  ఓ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా ఉందనే వాదనలు వినపడ్డాయి. ఈ క్రమంలో కుటుంబరావు క్షమాపణలు తెలిపారు.

వ్యవహారిక గ్రామీణ భాషా ప్రయోగమే తప్ప ఇందులో ఏ ఒక్కరిని కించపరిచే ఉద్దేశంతో చేసింది కాదని ఆయన చెప్పారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భజనపరులుగా వ్యవహరిస్తున్నారనే ఉద్దేశంతో తాను ఆ వ్యాఖ్యలు చేశానన్నారు.
 
ఈ వ్యాఖ్యలు ఒక కులానికి మనస్తాపం కలిగించినందుకు క్షమాపణలు కోరుతున్నానన్నారు. ఇందులో ఎవరినీ నొప్పించాలనే ఉద్దేశం ఏ మాత్రం లేదని కుటుంబరావు మీడియా ద్వారా తెలియజేశారు. అయితే ఈయన క్షమాపణలపై వైసీపీ నేతలు ఎలా రియాక్టవుతారో వేచి చూడాల్సిందే మరి.

PREV
click me!

Recommended Stories

Rammohan Naidu Speech: రామ్మోహన్ నాయుడు పంచ్ లకి పడి పడి నవ్విన చంద్రబాబు, లోకేష్| Asianet Telugu
CM Chandrababu Naidu Speech: దావోస్‌ పర్యటనలో జగన్ పై చంద్రబాబు పంచ్ లు| Asianet News Telugu