కర్నూలు జిల్లాలో రైతును శ్రీమంతుడిని చేసిన తొలకరి.. పొలంలో దొరికిన వజ్రం.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. !!

Published : Jun 06, 2023, 10:31 AM IST
కర్నూలు జిల్లాలో రైతును శ్రీమంతుడిని చేసిన తొలకరి.. పొలంలో దొరికిన వజ్రం.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. !!

సారాంశం

రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ప్రతి ఏడాది వజ్రాల వేట భారీగానే సాగుతుంది. వర్షాలు పడటం ప్రారంభం కాగానే.. చాలా మంది పొలాల వెంబడి తిరుగుతూ వజ్రాల వేట సాగిస్తారు. 

రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ప్రతి ఏడాది వజ్రాల వేట భారీగానే సాగుతుంది. వర్షాలు పడటం ప్రారంభం కాగానే.. చాలా మంది పొలాల వెంబడి తిరుగుతూ వజ్రాల వేట సాగిస్తారు. తొలకరి వర్షాలు పడిన వెంటనే స్థానికులు వజ్రాల కోసం వెదికే పనిలో నిమగ్నమయ్యారు. అయితే తాజాగా కర్నూలు జిల్లాలో ఓ రైతు పంట పండింది. పొలం పనులు చేస్తుండగా వజ్రం దొరికింది. వివరాలు.. తుగ్గలి మండలం బసనేపల్లిలో పొలం పనులు చేస్తుండగా ఓ రైతుకు వజ్రం దొరికింది. ఈ విషయం తెలుసుకున్న వ్యాపారులు వజ్రం కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డారు. 

అయితే చివరకు గుత్తికి చెందిన వ్యాపారి ఒక్కరు రూ. 2 కోట్లకు ఆ వజ్రాన్ని కొనుగోలు చేసినట్టుగా ప్రచారం సాగుతుంది. అయితే ఈ సీజన్‌లో లభించిన అత్యంత విలువైన వజ్రంగా దీనిని చెబుతున్నారు. సాధారణంగా  లక్షల రూపాయలు విలువ చేసే వజ్రాలు ఈ ప్రాంతంలో దొరుకుతాయని.. కానీ రూ. 2 కోట్ల విలువైన లభించడం అరుదు అని స్థానికులు తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో రైతులు, స్థానికులు పొలాల్లో వజ్రాల వేటను మరింత ముమ్మరం చేశారు. ఒక్క వజ్రం దొరికితే శ్రీమంతులుగా మారుతామనే ఆశతో స్థానికులు వేట కొనసాగిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?