కలెక్టరేటే మండపంగా, ఉద్యోగులే అతిథులుగా... ఐఎఎస్ అమ్మాయి, ఐపిఎస్ అబ్బాయి ఆదర్శ వివాహం (వీడియో)

Published : Aug 09, 2023, 04:58 PM ISTUpdated : Aug 09, 2023, 05:01 PM IST
కలెక్టరేటే మండపంగా, ఉద్యోగులే అతిథులుగా... ఐఎఎస్ అమ్మాయి, ఐపిఎస్ అబ్బాయి ఆదర్శ వివాహం (వీడియో)

సారాంశం

ఐఎఎస్ అమ్మాయి, ఐపిఎస్ అబ్బాయి వివాహం కృష్ణా జిల్లా కలెక్టరేట్ వేదికగా అత్యంత నిరాడంబరంగా జరిగింది. 

మచిలీపట్నం : ప్రస్తుతం వివాహం అంటేనే భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కేవలం పెళ్ళనే కాదు ఏ శుభకార్యమైనా ఆడంబరంగా నిర్వహించడమే కొందరు తమ స్టేటస్ సింబల్ గా బావిస్తున్నారు. అలాంటి ఆలోచన కలిగినవారి ఈ పెళ్లి కనువిప్పు లాంటింది. వధువు ఐఏఎస్, వరుడు ఐపిఎస్ గా వుండికూడా రిజిస్ట్రార్ ఎదుట దండలు మార్చుకుని  అత్యంత సాధాసీదాగా వివాహం చేసుకున్నారు. ఈ ఆదర్శ వివాహానికి కృష్ణా జిల్లా కలెక్టరేట్ వేదికయ్యింది.  

కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్న అపరాజిత సింగ్ సిన్వర్ తన సొంతరాష్ట్రం రాజస్థాన్ కే చెందిన ట్రైనీ ఐపిఎస్ దేవేంద్ర కుమార్ ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు. ఉత్తర ప్రదేశ్ కేడర్ ఐపిఎస్ దేవేంద్ర కుమార్ ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. తమ పెళ్లకి ఇదే మంచి సమయంగా భావించిన అపరాజిత, దేవేంద్ర మచిలీపట్నంలోని కలెక్టరేట్ లోనే వివాహం చేసుకున్నారు.  

వీడియో

కృష్ణా జిల్లా కలెక్టరేట్ సిబ్బంది మధ్యనే రిజిస్ట్రార్ ఎదుట అపరాజిత, దేవేంద్ర పెళ్లి చేసుకున్నారు. ఎలాంటి ఆర్బాటాలు లేకుండా కేవలం ఒకరికొకరు దండలు వేసుకుని పెళ్లి తంతు ముగించారు. నూతన దంపతులకు కలెక్టరేట్ ఉద్యోగులు అభినందనలు తెలిపారు. 

పెళ్ళి తర్వాత నూతన దంపతులు అపరాజిత, దేవేంద్ర కుమార్ గుడ్లవల్లేరు మండలం వేమవరంలోని శ్రీకొండాలమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఉన్నత పదవుల్లో వుండి ఇంత సాధాసీదాగా పెళ్లి చేసుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు