కృష్ణా జిల్లా క్రైమ్... మద్యం మత్తులో తోటి కార్మికుడి దారుణ హత్య (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Aug 26, 2021, 01:12 PM IST
కృష్ణా జిల్లా క్రైమ్... మద్యం మత్తులో తోటి కార్మికుడి దారుణ హత్య (వీడియో)

సారాంశం

మద్యం మత్తులో ఓ వ్యక్తి తోటి కార్మికున్ని అతి కిరాతకంగా హతమార్చిన దారుణం కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.  

విజయవాడ: కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం చిననందిగామలో దారుణం చోటుచేసుకుంది. బుధవారం అర్ధరాత్రి గాడ నిద్రలో వున్న తోటి కార్మికున్ని అతి కిరాతకంగా హత్య చేశాడు మరో కార్మికుడు. నిందితుడు మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. 

వివరాల్లోకి వెళితే... విజయవాడకు చెందిన విజేశ్వరరావు, అప్పలస్వామి మార్బుల్స్ పని చేస్తుంటారు. ఇటీవల చిననందిగామలో ఓ ఇంట్లో మార్బుల్స్ పని ప్రారంభించారు. అయితే బుధవారం పని ముగించుకున్న తర్వాత ఇద్దరూ ఫుల్లుగా మద్యం సేవించారు.  ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది.  

వీడియో

మద్యం మత్తులో విచక్షణను కోల్పోయిన విజేశ్వరరావు దారుణానికి ఒడిగట్టాడు. అర్ధరాత్రి గాడ నిద్రలో వుండగా అప్పలస్వామిపై దాడిచేసి హతమార్చి అక్కడినుండి పరారయ్యాడు. ఉదయం రక్తపుమడుగులో పడివున్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 

ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో వున్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. అతడిని విచారిస్తే హత్యకు గల కారణాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Cyclone Arnab : అర్నబ్ తుపాను లోడింగ్..? రాబోయే మూడ్రోజులు వర్ష బీభత్సమే, ఇక్కడ అల్లకల్లోలం తప్పదు
అమిత్ షా తో చంద్రబాబు కీలక భేటి: CM Chandrababu Meets Amit Shah at Delhi | Asianet News Telugu