చంద్రబాబు మా ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు: కన్నా లక్ష్మీనారాయణ

By Nagaraju penumalaFirst Published Feb 1, 2019, 5:41 PM IST
Highlights


నిస్సిగ్గుగా హోదా కోసం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మానసిక వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు ఏపికి సీఎంగా కొనసాగడం ప్రమాదకరమన్నారు. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుని బెదిరిస్తూ చంద్రబాబు సభలో ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. 

విజయనగరం: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంతోషం వ్యక్తం చేశారు. ఎన్డీఏ 2 ఎలా ఉండబోతుందో ఈ శాంపిల్ బడ్జెట్ చూస్తే తెలుస్తుందన్నారు. 

విజయనగరం జిల్లాలో పర్యటించిన ఆయన కేంద్రం 126 సంక్షేమ పథకాలు రూపకల్పన చేసి రాష్ట్రాలకు పంపుతుంటే వాటి పేరు మార్చి టీడీపీ కార్యకర్తలకు పంచిపెడుతున్నారని చంద్రబాబునాయుడుపై విరుచుకుపడ్డారు. కేంద్ర బడ్జెట్ రైతులకు ఒక వరంలా మారనుందన్నారు. 

రైతులను ఆదుకునేలా కేంద్రం తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. ఇన్ కంటాక్స్ లిమిట్ పెంచడం, పీఎఫ్ లిమిట్ పెంచడం శుభపరిణామమన్నారు. సంపూర్ణ భారత అభివృద్దికి చేపట్టిన బడ్జెట్ గా కన్నా అభివర్ణించారు. ఇంతటి సంపూర్ణ బడ్జెట్ ఇచ్చినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. 

మరోవైపు ఈనెలలో ప్రధాని మోదీ , బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు ఏపీలో పర్యటించనున్నారని తెలిపారు. ఫిబ్రవరి 4న అమిత్ షా విజయనగరంలో పర్యటిస్తారని తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గ ప్రతినిధులతో మాట్లాడతారని తెలిపారు. 

చైతన్య సభ, సత్యమేవ జయితే సభల పేరుతో కేంద్రం రాష్ట్రానికి ఏం చేసిందో ప్రజలకు అదే చెప్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో చంద్రబాబునాయుడు దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు మానసిక వ్యాధి వచ్చిందని అందువల్లే అలా మాట్లాడుతున్నారని తెలిపారు. 

నిస్సిగ్గుగా హోదా కోసం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మానసిక వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు ఏపికి సీఎంగా కొనసాగడం ప్రమాదకరమన్నారు. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుని బెదిరిస్తూ చంద్రబాబు సభలో ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. 

ముఖ్యమంత్రిని వెంటనే బర్తరఫ్ చెయ్యాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 4న బీజేపీ బస్సుయాత్ర ప్రారంభం కానుందని అమిత్ షా ప్రారంభిస్తారని తెలిపారు. అటు బీజేపీ నేత దగ్గుబాటి పురంధీశ్వరి బీజేపీ వీడరని తెలిపారు. 

ఆమె బీజేపీలోనే ఉన్నారని ఉంటారని కూడా స్పష్టం చేశారు. ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు బీజేపీలో చేరలేదని అతని గురించి అనవసరం అని వ్యాఖ్యానించారు కన్నా లక్ష్మీనారాయణ. 

click me!