వైయస్ వివేకా హత్యకేసు: వదంతలు నమ్మెుద్దన్న ఎస్పీ అన్బురాజన్

By Nagaraju penumalaFirst Published Oct 13, 2019, 1:38 PM IST
Highlights

వివేకానంద హత్యకేసులో సునీల్ గ్యాంగ్ ప్రమేయం ఉందంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని పూర్తిగా అవాస్తవం అంటూ కొట్టిపారేశారు. ఇలాంటి అబద్దపు ప్రచారాలు చేయడం సరికాదన్నారు. 

కడప: ఏపీ సీఎం జగన్ చిన్నాన్న మాజీమంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై వస్తున్న వదంతులను నమ్మవద్దని సూచించారు కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్. వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

వివేకానంద హత్యకేసులో సునీల్ గ్యాంగ్ ప్రమేయం ఉందంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని పూర్తిగా అవాస్తవం అంటూ కొట్టిపారేశారు. ఇలాంటి అబద్దపు ప్రచారాలు చేయడం సరికాదన్నారు. అవాస్తవాలను ప్రచారం చేయోద్దని చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

ఇకపోతే వైయస్ వివేకానంద హత్య ప్రొద్దుటూర్ కు చెందిన సునీల్ గ్యాంగ్ పనేనంటూ వార్తలు హల్ చల్ చేశాయి. సుపారీ తీసుకుని వైయస్ వివేకానందరెడ్డిని హత్య చేశారంటూ వార్తలు రావడంతో ఎస్పీ అన్బురాజన్ స్పందించారు.  

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ చిన్నాన్న వివేకా హత్య కేసులో ట్విస్ట్: సుపారీ ఎవరిచ్చారో తేల్చేపనిలో సిట్

click me!