టీడీపీ కి షాక్.. వైసీపీలోకి ప్రముఖ న్యాయమూర్తి

Published : Dec 04, 2018, 11:17 AM IST
టీడీపీ కి షాక్.. వైసీపీలోకి ప్రముఖ న్యాయమూర్తి

సారాంశం

ప్రముఖ న్యాయమూర్తి నక్కా బాలయోగి వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారా..? అవుననే సమాధానమే వినపడుతోంది.

ప్రముఖ న్యాయమూర్తి నక్కా బాలయోగి వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారా..? అవుననే సమాధానమే వినపడుతోంది.  హైదరాబాద్ సిటీ  హైకోర్టు జడ్జిగా కొనసాగుతున్న ఆయన..  సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. నక్కా బాల యోగి.. వచ్చే సంవత్సరం జనవరి 14వ తేదీని రిటైర్ కానున్నారు. ఈ లోపుగానే ఆయన అత్యవసరంగా తన పదవికి రాజీనామా చేశారు.

కేవలం వైసీపీలో చేరేందుకే ఆయన తన జడ్జి పదవికి రాజీనామా చేసినట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆయన జగన్ తో సమావేశమై చర్చలు జరిపినట్లు సమాచారం. బాల యోగి.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి. ఏపీలో త్వరలో జరిగే ఎన్నికల్లో ఈయన వైసీపీ తరపున కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్ లోనే కోల్డెస్ట్ 48 గంటలు.. ఈ ప్రాంతాల్లో చలిగాలుల అల్లకల్లోలమే
Roja vs Kirrak RP: నీ పిల్లల ముందు ఇలాంటి మాటలు అనగలవా? రోజాకు గట్టిగా ఇచ్చేసిన కిర్రాక్ ఆర్పి