వైఎస్ఆర్ పెంపకం మంచిదే, కానీ...: ఏపీ సీఎం జగన్ పై జేసీ సంచలనం

By narsimha lodeFirst Published May 2, 2022, 4:36 PM IST
Highlights


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తాడిపత్రి మున్సిపల్ చైర్మెన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రిలో ఆయన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

నంతపురం: ఆంధ్రప్రదేశ్ సీఎం YS Jaganపై తాడిపత్రి మున్సిపల్ చైర్మెన్  JC Prabhakar Reddyమరోసారి విమర్శలు చేశారు.  సోమవారం నాడు Tadipatriలో ఆయన మీడియాతో మాట్లాడారు.  ఏపీ సీఎం జగన్ గురించి  జేసీ ప్రభాకర్ రెడ్డి పరోక్షంగా విమర్శలు చేశారు.  వైఎస్ జగన్ ను తల్లి సరిగా పెంచలేదని   ఓ మహా తల్లి చెప్పిందన్నారు. ఆమె ఎలా పెంచిందో అడిగి తెలుసుకొంటానన్నారు. 

ఆయనను పెంచడం YS  Rajasekhara Reddyకి కష్టం అయిందన్నారు. వాళ్ల పెంపకం మంచిదే, కానీ అప్పటికే డైవర్ట్ అయి వాళ్ల తాత రాజారెడ్డి దగ్గరికి ఈయన వెళ్లాడని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. తాత Raja Reddy పెంచడంతోనే సేమ్ టూ సేమ్ రాజారెడ్డి లాగానే జగన్ తయారయ్యాడని జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Andhra Pradesh రాష్ట్రంలో వద్యుత్, మంచినీళ్లు, రోడ్లు కూడా సరిగా లేవని తెలంగాణ మంత్రి KTR  చేసిన వ్యాఖ్యలపై కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు.కేటీఆర్ వ్యాఖ్యలకు తగ్గట్టుగానే రాష్ట్రంలో పరిస్థితులున్నాయన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను కేటీఆర్ ఎందుకు వెనక్కి తీసుకొన్నారో తెలియదన్నారు. కేటీఆర్  మాట జారినట్టుగా వివరణ ఇచ్చుకున్నా కూడా రాష్ట్రంలో పరిస్థితిని కళ్లకు కట్టినట్టుగా వివరించారని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు..ఏపీలో రోడ్లు, తాగునీటి సమస్య, విద్యుత్ పై ఫోటోలు తీసి తాను పంపిస్తానని జేసీ ప్రభాకర్  రెడ్డి చెప్పారు. కానీ తాను మాత్రం ఏపీలో పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవద్దని కేటీఆర్ కి జేసీ ప్రభాకర్ రెడ్డి సలహా ఇచ్చారు.

ప్రబోధానంద ఆశ్రమం కేసులో ఎస్పీ అనే దేవుడి దగ్గరికి తాను  వెళ్లానని చెప్పారు. ఆయన చేతుల్లో ఏమిలేదన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర ఫైల్ ఉంది. తాడిపత్రి నాయకులు చెప్పిన వారిపైనే కేసులు పెడుతున్నారన్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనలో కేసులు పెట్టిన వారిలో  46 మందిలో 35 మంది ముస్లింలేని ప్రభాకర్ రెడ్డి గుర్తు చేశారు.
ఇంత దారుణమా అని ఆయన ప్రశ్నించారు. ఈ కథేంటో సజ్జల రామకృష్ణా రెడ్డే  చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.సజ్జలనే ఏదో ఒక రోజు దీనికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందన్నారు. పెద్దవడగూరు ఎస్ఐ అత్యుత్సాహం చూపుతున్నాడని జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు.. వైఎస్సార్ పార్టీ డ్రస్ వేసుకున్నావా ఏంటి..? తగ్గించుకో లేకుంటే జనం తిరగబడుతారని జేసీ వార్నింగ్ ఇచ్చారు.

గతంలో కూడ ఏపీ సీఎం వైఎస్ జగన్ పై జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శలు చేశారు. జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డిపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో అరెస్టైన జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టై జైలుకు కూడా వెళ్లి వచ్చారు.

click me!