బీజేపీలోకి జేసీ కుటుంబం.. ప్రభాకర్ రెడ్డి క్లారిటీ

Published : Jul 04, 2019, 09:43 AM ISTUpdated : Jul 04, 2019, 12:07 PM IST
బీజేపీలోకి జేసీ కుటుంబం.. ప్రభాకర్ రెడ్డి క్లారిటీ

సారాంశం

ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో... టీడీపీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఈ క్రమంలో కొందరు నేతలు పార్టీలు మారడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.

ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో... టీడీపీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఈ క్రమంలో కొందరు నేతలు పార్టీలు మారడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. రాష్ట్రంలో తమ బలాన్ని పెంచుకోవడానికి బీజేపీ కూడా సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో టీడీపీ నేతలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. కాగా... జేసీ కుటుంబం కూడా బీజేపీలో చేరబోతున్నారంటూ గత కొద్ది రోజులగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే.. దీనిపై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

 టీడీపీని వీడే ప్రసక్తే లేదని ప్రభాకర్‌రెడ్డితో పాటు జేసీ పవన్‌రెడ్డి తేల్చి చెప్పారు. నేడు ప్రభాకర్‌రెడ్డి, పవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గత 40 సంవత్సరాలుగా జేసీ కుటుంబాన్ని ఆదరిస్తున్న తాడిపత్రి నియోజకవర్గ ప్రజలకు, టీడీపీ నేతలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు
 

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు