రాష్ట్ర రాజకీయాల్ని మార్చే సామర్థ్యం పవన్ కల్యాణ్‌కే ఉంది.. జనసేన నేత హరిప్రసాద్..

Published : Mar 14, 2022, 05:07 PM ISTUpdated : Mar 14, 2022, 05:10 PM IST
రాష్ట్ర రాజకీయాల్ని మార్చే సామర్థ్యం పవన్ కల్యాణ్‌కే ఉంది.. జనసేన నేత హరిప్రసాద్..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని మార్చే సామర్థ్యం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కే ఉందని ఆ పార్టీ నేత హరిప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో ల్యాండ్, ఇసుక మాఫియా రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు.  

జనసేన (Jana Sena) ఆవిర్బావ దినోత్సవ సభ ప్రారంభం అయింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన జనసేన ఆవిర్బావ సభ ప్రాగంణానికి భారీగా జన సైనికులు తరలివచ్చారు. మరికాసేపట్లలోనే జనసేన అధినేత Pawan Kalyan సభా వేదిక వద్దకు చేరుకోనున్నారు. ఈలోపు ప్రసంగిస్తున్న సభా వేదిక పైనుంచి ప్రసంగిస్తున్న జనసేన నేతలు.. ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. రాబోయేది జనసేన ప్రభుత్వమేనని.. పవన్ కల్యాణ్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక, జనసేన ఆవిర్భావ సభా ప్రాంగణానికి దామోదరం సంజీవయ్య చైతన్య వేదిక అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని మార్చే సామర్థ్యం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కే ఉందని ఆ పార్టీ నేత హరిప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో ల్యాండ్, ఇసుక మాఫియా రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపించడంతో పవన్ వల్లే సాధ్యమని అన్నారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు జనసేన కృషి చేస్తోందన్నారు. 

కరోనా వేళ జన సైనికుల సేవా కార్యక్రమాలు అపూర్వమని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. కోవిడ్ వల్ల చనిపోయినవారికి సభా వేదిక పైనుంచి సంతాపం తెలియజేశారు. ప్రజాసేవలో ప్రాణాలు కోల్పోయిన వారికి సభ అంకితం చేస్తున్నట్టుగా చెప్పారు. 

ఇక, జనసేన అవిర్భావ సభకు తరలివచ్చే కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్టుగా జనసేన నేతలు చెబుతున్నారు. రాష్ట్ర క్షేమాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ కూడా  సభకు ఆహ్వానితులేనని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ వీడియో సందేశాన్ని ఆ పార్టీ ఇవాళ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఏపీ భవిష్యత్తు కోసం జనసేన దిశా నిర్ధేశం చేయనుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీన్ని తాము జనసేన ఆవిర్భావ దినోత్సవంగా చూడడం లేదని.. ఏపీ దిశా నిర్ధేశాన్ని చూసే సభగా భావిస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జనసేనపై వస్తున్న విమర్శలకు తాము ఈ సభా వేదికగా సమాధానం చెప్పనున్నామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chandrababu Power Full Speech: అనకాపల్లిలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం| Asianet News Telugu
Kandula Durgesh Super Speech: Amarajeevi Jaladhara Scheme Foundation Ceremony | Asianet News Telugu