మోదీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ఆర్టికల్ 370 రద్దుకు పవన్ మద్దతు

By Nagaraju penumalaFirst Published Aug 5, 2019, 9:08 PM IST
Highlights

ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేయడం కొన్ని ప్రాంతాల వారికి ఇబ్బంది కలిగించినప్పటికీ శాశ్వతంగా శాంతి నెలకొంటుందని విశ్వసిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీని ఒక భారతీయుడిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు.ఈ నిర్ణయంతో రెండు దేశాల మధ్య శాంతి నెలకొంటుందని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.  

భీమవరం: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంలో కేంద్రప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆర్టికల్ 370 రద్దుతో సౌందర్యవంతమైన కశ్మీర్ లో శాంతి నెలకొంటుందని బలంగా నమ్ముతున్నట్లు తెలిపారు.  

అఖండ భారతదేశం నుంచి పాకిస్థాన్ విడిపోయినప్పుడు జరిగిన హింసలో రెండు ప్రాంతాల నుంచి లక్షల మంది చనిపోయారని చదివినపుడు హృదయం ఆవేదనకు గురయ్యిందని పవన్ చెప్పుకొచ్చారు. 

click me!