ఏపీలో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ మౌన దీక్ష..

Published : Oct 02, 2023, 12:09 PM IST
ఏపీలో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ మౌన దీక్ష..

సారాంశం

గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నం సువర్ణ కల్యాణ్ మండపం వద్ద గాంధీ చిత్రపటానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పూలమాల వేసి నివాళులర్పించారు.

గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నం సువర్ణ కల్యాణ్ మండపం వద్ద గాంధీ చిత్రపటానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏపీలో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ మౌన దీక్షకు దిగారు. పవన్‌కు సంఘీభావంగా పలువురు జనసేన నేతలు ఈ దీక్షలో పాల్గొన్నారు. రెండు గంటల పాటు పవన్ కల్యాణ్ మౌన దీక్ష సాగనుంది. 

ఇక, గాంధీ జయంతి సందర్భంగా పవన్ కల్యాణ్ మహాత్మునికి నివాళులర్పిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. సత్యం, అహింస అనే ఆయుధాలతో యుద్దం చేయడంఎలాగో ప్రపంచ మానవాళికి ఆచరించి చూపిన మహాత్ముడు మన గాంధీజీ, మహాత్ముడి బాటలోనే నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ లాంటివారు నడిచారు. మనదేశ స్వతంత్ర పోరాటాన్నీ, గాంధీజీ జీవితాన్నీ వేర్వేరుగా చూడలేము. అహింసాయుత ప్రజా పోరుతో పరాయి పాలన నుంచి భారతదేశాన్ని విముక్తి చేశారు. బాపూజీ జయంతి సందర్భంగా మహాత్మున్ని సర్మించుకుంటూ మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నాను. 

బ్రిటిషర్ల లక్షణాలు పుణికి పుచ్చుకున్న పాలకులు రాష్ట్రంలో ఉన్నారు. ప్రజలను వర్గాలుగా విభజించి పాలించే ధోరణిలో వెళ్తున్నారు. ఓటు, సత్యాగ్రహం విలువను గాంధీజీ తెలియజెప్పారు. ఆ ఆయుధాలు ఉపయోగించి బ్రిటీష్ పాలకులను రాష్ట్రం నుంచి పంపించడం మన ధర్మంగా ప్రజలు భావించాలి’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు