పార్టీ బలోపేతం దిశగా పవన్ కళ్యాణ్ వ్యూహాలు: ఏడు కమిటీలు నియామకం

By Nagaraju penumalaFirst Published Jun 24, 2019, 11:49 PM IST
Highlights

ఇకపోతే ప‌బ్లిక్ గ్రీవెన్స్ క‌మిటీ చైర్మ‌న్‌గా జ‌న‌సేన‌ శాస‌న స‌భ్యులు రాపాక వ‌ర‌ప్ర‌సాద్ పేరును ఖ‌రారు చేశారు. గ‌వ‌ర్న‌మెంట్ ప్రోగ్రామ్స్ మోనిట‌రింగ్ క‌మిటీ చైర్మ‌న్‌గా చింత‌ల పార్ధ‌సార‌థిని నియమించారు. 
 


అమరావతి: గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరఓటమి చవిచూసిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం జిల్లాల వారీగా రివ్యూలు నిర్వహించిన పవన్ కళ్యాణ్ పార్టీ పటిష్టత కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

పార్టీ బలోపేతమే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నారు. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా సోమవారం జనసేన పార్టీ కార్యకర్తలు, ముఖ్యనేతలతో జనసేనాని పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. 

అనంతరం ఏడు కమిటీలకు చైర్మన్ లను ప్రకటించారు. లోకల్ బాడీ ఎలక్షన్ కమిటీ చైర్మన్ గా మాజీ సీఎస్ పి.రామ్మోహన్ రావును నియమించారు. కమిటీ ఫర్ మైనారిటీస్ చైర్మన్ గా విద్యావేత్త అర్హంఖాన్ ను, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ గా దళిత ఉద్యమనేత అప్పికట్ల భరత్ భూషన్ ను నియమించారు. 

మ‌హిళా సాధికారిత క‌మిటీ చైర్‌ప‌ర్స‌న్‌గా క‌ర్నూలు జిల్లా కు చెందిన శ్రీమ‌తి రేఖాగౌడ్‌ను నియ‌మించారు. రేఖాగౌడ్ ప్ర‌స్తుతం వీర మ‌హిళా విభాగం చైర్మ‌న్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమెను మహిళా సాధికారికత కమిటీ చైర్మన్ గా ఎంపిక చేశారు. పార్టీ నిర్వ‌హ‌ణ క‌మిటీ చైర్మ‌న్‌గా పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ ను నియమించారు. 

ఇకపోతే ప‌బ్లిక్ గ్రీవెన్స్ క‌మిటీ చైర్మ‌న్‌గా జ‌న‌సేన‌ శాస‌న స‌భ్యులు రాపాక వ‌ర‌ప్ర‌సాద్ పేరును ఖ‌రారు చేశారు. గ‌వ‌ర్న‌మెంట్ ప్రోగ్రామ్స్ మోనిట‌రింగ్ క‌మిటీ చైర్మ‌న్‌గా చింత‌ల పార్ధ‌సార‌థిని నియమించారు. 

లోకల్ బాడీ ఎలక్షన్ కమిటీలో సభ్యులుగా  తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పంతం నానాజీ, పితాని బాలకృష్ణ, పొలసపల్లి సరోజ, పాటంశెట్టి సూర్యచంద్ర, వై.శ్రీనులకు అవకాశం కల్పించగా పశ్చిమగోదావరి జిల్లా నుంచి బొలిశెట్టి శ్రీనివాస్, ఘంటసాల వెంకటలక్ష్మీలను నియమించారు.

అలాగే కృష్ణా జిల్లా నుంచి అంకెం లక్ష్మీశ్రీనివాస్, సుందరపు విజయకుమార్, కడప జిల్లా నుంచి ఇంజా సోమశేఖర్ రెడ్డి, శ్రీకాకుళం జిల్లా నుంచి కోత పూర్ణచంద్రరావు, బాడన వెంకట జనార్థన్ లను నియమించారు. 

ఇక గుంటూరు జిల్లా నుంచి సయ్యద్ జిలాని, ఒంగోలు నుంచి షేక్ రియాజ్, లకు లోకల్ బాడీ ఎలక్షన్ కమిటీ చైర్మన్ గా అవకాశం కల్పించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మిగిలిన కమిటీలను కూడా త్వరలోనే ప్రకటిస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 
 

click me!