టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తన మద్ధతు కొనసాగుతుందన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. చట్టాలు సరిగా పనిచేస్తే బెయిల్‌పై వచ్చినవాళ్లు సీఎం కాలేరని పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం.. రాజకీయాలను మరో స్థాయికి తీసుకెళ్లిందన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తన మద్ధతు కొనసాగుతుందన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోనసీమ జిల్లాలో 2 వేల మంది నేరగాళ్లను దింపారని ఆరోపించారు. తణుకు, భీమవరంలో వారాహి యాత్రపై డాడి చేసేందుకు ప్రయత్నించారని పవన్ దుయ్యబట్టారు. ప్రజలను భయభ్రాంతులను చేసేందుకు ప్రయత్నించారని.. మీరు చసిన పనులకు ఎవరూ భయపడేవాళ్లు లేరని గుర్తించాలన్నారు.
చట్టాలు సరిగా పనిచేస్తే బెయిల్‌పై వచ్చినవాళ్లు సీఎం కాలేరని పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు కుట్రలు పన్నారని.. కోనసీమ జిల్లాలో 50 మందిని చంపేయాలని పథకం పన్నారని పవన్ ఆరోపించారు. వైసీపీ మూకల కుట్ర తెలిసి కేంద్ర పెద్దలు దానిని నిలువరించారని ఆయన పేర్కొన్నారు. నాకు కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి ఈ సమాచారం వచ్చిందని పవన్ కల్యాణ్ తెలిపారు.
దివ్యాంగులను సైతం బెదిరిస్తున్నారని.. రాజకీయాలు ప్రశాంతంగా వుంటాయని ఎప్పుడూ అనుకోవద్దన్నారు. ప్రశ్నించే వారిపై హత్యా కేసులు నమోదు చేస్తున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రకాలుగా అడ్డుకున్నారే కనుకే రోడ్డుపై పడుకుని నిరసన తెలిపానని ఆయన చెప్పారు. ఈ ప్రభుత్వం.. రాజకీయాలను మరో స్థాయికి తీసుకెళ్లిందన్నారు. మద్యనిషేధం అన్నవారు.. దానిపైనే డబ్బు సంపాదిస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు.
రాష్ట్ర ప్రజలంతా మేల్కోవాల్సిన సమయం ఇది అన్నారు. వివేకా హత్యకు గురైతే ఆయన కుటుంబ సభ్యులే ఒక్కోలా మాట్లాడారని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. రాత్రి తనను పోలీసులు అడ్డుకున్నారని, అప్పుడు తానేం చేయాలని ఆయన ప్రశ్నించారు. వైసీపీ నేతలు యుద్ధం కోరుకుంటున్నారని మండిపడ్డారు. జీ20 సమావేశాల నుంచి దృష్టి మళ్లించేందుకే చంద్రబాబును అరెస్ట్ చేశారని పవన్ కల్యాణ్ ఆరోపించారు.
జగన్ వైఖరి గురించి కేంద్ర నాయకత్వానికి చెప్పాలని అనుకుంటున్నానని తెలిపారు. కేంద్ర నాయకులు కూడా ఒక్కోసారి ఏమీ చేయలేరని పవన్ వ్యాఖ్యానించారు. కొన్ని సార్లు కేంద్ర నాయకత్వం చేతులు కూడా కట్టేసి వుంటాయన్నారు. ఏపీకి కేంద్రం అండగా నిలిచిందన్న గౌరవం కూడా జగన్‌కు లేదన్నారు. రాష్ట్ర పరిస్ధితులను కూడా కేంద్రం లోతుగా అధ్యయనం చేయాలని పవన్ కల్యాన్ పిలుపునిచ్చారు.