పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆటో ఎక్కారు.
కాకినాడ:పిఠాపురం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారంనాడు ఆటోలో ప్రయాణించారు. గత నాలుగు రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారంనాడు కొత్తపల్లి మండలం కొండెవరం వద్ద ఆటోలో ప్రయాణించారు. తనను గెలిపించాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఈ ప్రాంతంలో రోడ్డు ఎలా ఉందో పరిశీలించారు. రోడ్లు సరిగా లేకపోవడంతో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని డ్రైవర్లను పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు.
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక అసెంబ్లీ స్థానాల నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఈ దఫా మాత్రం పిఠాపురం అసెంబ్లీ స్థానం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇంకా రెండు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను జనసేన ప్రకటించాల్సి ఉంది.
undefined
ఆటో ఎక్కిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
పర్యటన ఆద్యంతం ప్రజలతో మమేకం అవుతూ.. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు యు.కొత్తపల్లి, కొండెవరం మధ్య ఆటోలో ప్రయాణించారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర ఆటో డ్రైవర్ చెంతన కూర్చుని ప్రయాణించిన ఆయన ఆటో డ్రైవర్ల సమస్యలు… pic.twitter.com/zqbnwXG9fV
2014 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ జనసేనను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం,బీజేపీ కూటమికి జనసేన మద్దతు ప్రకటించింది. ఈ కూటమి అభ్యర్థులకు మద్దతుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.