
జగ్గయ్యపేట రాజకీయాలు :
జగ్గయ్యపేట నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీకి మంచి పట్టు వుంది. నెట్టెం రఘురాం వరుసగా మూడుసార్లు (1985, 1989, 1994) జగ్గయ్యపేట ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా కూడా చేసారు. ఆ తర్వాత శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య (2009,2014) లో టిడిపి ఎమ్మెల్యేగా పనిచేసారు.
ప్రస్తుతం జగ్గయ్యపేట ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఉదయభాను గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కూడా పనిచేసారు. వరుసగా రెండుసార్లు (1999,2004) లో ఇదే జగ్గయ్యపేట నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.
జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలోని మండలాలు :
1. వత్సలాయి
2. జగ్గయ్యపేట
3. పెనుగంచిప్రోలు
4. నందిగామలోకి కొంత భాగం
జగ్గయ్యపేట అసెంబ్లీ ఓటర్లు :
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 1,95,729
పురుషులు - 95,141
మహిళలు - 1,00,577
జగ్గయ్యపేట అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :
వైసిపి అభ్యర్థి :
వైసిపి మళ్లీ సామినేని ఉదయభానును బరిలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఆయన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించలేదు.
టిడిపి అభ్యర్థి :
తెలుగుదేశం పార్టీ మరోసారి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యను జగ్గయ్యపేట బరిలో దింపుతోంది.
జగ్గయ్యపేట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ;
జగ్గయ్యపేట అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :
నియోజకవర్గంలో నమోదైన మొత్తం ఓటర్లు - 1,95,729
పోలయిన మొత్తం ఓట్లు 1,76,115 (89 శాతం)
వైసిపి - సామినేని ఉదయభాను - 87,965 (49.95 శాతం) - 4,778 ఓట్లతేడాతో విజయం
టిడిపి - శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య- 83,187 (47 శాతం) - ఓటమి
జగ్గయ్యపేట అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,65,720 (89 శాతం)
టిడిపి - శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య - 82,939 (48 శాతం) - 3,846 ఓట్ల తేడాతో విజయం
వైసిపి - సామినేని ఉదయ భాను - 79,093 (47 శాతం) - ఓటమి