కేసీఆర్‌తో కలిసి మోడీ ప్రమాణస్వీకారానికి జగన్

Published : May 27, 2019, 03:08 PM IST
కేసీఆర్‌తో కలిసి మోడీ ప్రమాణస్వీకారానికి జగన్

సారాంశం

ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత  జగన్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని సమాచారం. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిసి జగన్ ఢిల్లీకి వెళ్లనున్నారని తెలుస్తోంది.  

అమరావతి: ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత  జగన్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని సమాచారం. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిసి జగన్ ఢిల్లీకి వెళ్లనున్నారని తెలుస్తోంది.

ఈ నెల 30వ తేదీన ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు జగన్ సీఎంగా ప్రమాణం చేస్తారు.

జగన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడ హాజరుకానున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 29వ తేదీనే విజయవాడకు చేరుకొంటారు. ఆ రోజు అక్కడే ఉంటారు. మరునాడు ఉదయమే కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొంటారు. ఆ తర్వాత జగన్ ప్రమాణస్వీకారోత్సవంలో కేసీఆర్ పాల్గొంటారు.

జగన్ ప్రమాణ స్వీకారోత్సవం పూర్తైన వెంటనే కేసీఆర్, జగన్‌లు ఒకే విమానంలో ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.  రెండో దఫా మోడీ ప్రమాణ స్వీకారోత్సవంలో జగన్, కేసీఆర్‌లు పాల్గొంటారని సమాచారం.
 

PREV
click me!

Recommended Stories

బుర్రిపాలెంని ఉర్రుతలూగించిన బాబు ఉరమాస్ స్పీచ్ | Chandrababu Buripalem Speech | Asianet Telugu
ఊహించని న్యూస్ చెప్పిన Pemmasani Chandrashekar | Chandrababu | Asianet Telugu