చిరునవ్వుతో స్వాగతించండి.. అధికారులకు జగన్ సూచన

Published : Jun 27, 2019, 12:47 PM IST
చిరునవ్వుతో స్వాగతించండి.. అధికారులకు జగన్ సూచన

సారాంశం

తమ సమస్యలు విన్నవించుకోవడానికి వచ్చిన ప్రజలను చిరు నవ్వుతో స్వాగతించాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

తమ సమస్యలు విన్నవించుకోవడానికి వచ్చిన ప్రజలను చిరు నవ్వుతో స్వాగతించాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో ఆయన కలెక్టర్లతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో... కెలక్టర్లకు కీలక ఆదేశాలు చేశారు.

ప్రతి సోమవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రీవెన్స్ డే నిర్వహించాలని సూచించారు. దానికి స్పందన అనే పేరును ఖరారు చేశారు. కార్యాలయాలకు వచ్చే  వచ్చిన ప్రజల వినతులను తీసుకొవాలని.. వారిని చిరు నువ్వుతో నవ్వుతూ సాదరంగా లోపలికి ఆహ్వానించాలని సూచించారు.

ప్రతి సమస్యను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని చెప్పారు. ప్రతి నెలా మూడో శుక్రవారం కాంట్రాక్టు  ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సమయం కేటాయించాలని సూచించారు. ఐఏఎస్ అధికారులు జిల్లాలో ప్రతి వారం ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆదేశించారు.

 హాస్టల్స్, పిహెచ్ సీలలో నిద్రించాలని  చెప్పారు.  అర గంట ముందు నిద్రించే ప్రాంతాన్ని ఫిక్స్ చేసుకోవాలని చెప్పారు.  అంతేగాని ఫలానా చోటికి వస్తున్నామని ముందే చెప్పి అక్కడ నిద్రించేందుకు ఏర్పాటు చేసుకోవద్దని హెచ్చరించారు. ఉదయాన్నే లేవగానే స్థానికులతో నవరత్నాల అమలు గురించి చర్చించాలని... ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవాలని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

మాస్క్ అడిగితె చంపేస్తారా? Varla Ramaiah Serious Comments on YS Jagan | Viral | Asianet News Telugu
Huge Job Scam: సీఎంపీషీ పేరుతో భారీ మోసం.. రూ.12 లక్షలు దోచుకున్న ముఠా అరెస్ట్ | Asianet News Telugu