టెండర్లు పూర్తైన ప్రాజెక్టులపై థర్డ్ పార్టీతో విచారణ: జగన్ కీలక నిర్ణయం

By narsimha lodeFirst Published Jun 6, 2019, 5:41 PM IST
Highlights

రాష్ట్రంలో  టెండర్లు పూర్తైన సాగునీటి ప్రాజెక్టులన్నింటిపై థర్ద్ పార్టీ విచారణ  చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకొన్నారు.

అమరావతి: రాష్ట్రంలో  టెండర్లు పూర్తైన సాగునీటి ప్రాజెక్టులన్నింటిపై థర్ద్ పార్టీ విచారణ  చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకొన్నారు.

గురువారం నాడు మధ్యాహ్నం  సాగునీటి ప్రాజెక్టులపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.రాష్ట్రంలో ఇప్పటికే టెండర్లు పూర్తైన సాగునీటి ప్రాజెక్టులను సాగునీటి, సాంకేతిక బృందం విచారణ చేయనుంది.

టెండర్ ప్రక్రియలో అవకతవకలు జరిగితే ఆ టెండర్లను రద్దు చేయడంతో  పాటు రీ టెండర్లను  పిలువనున్నారు. రాష్ట్రంలోని సుమారు 20 వేల కోట్లకు చెందిన సాగునీటి ప్రాజెక్టులకు చెందిన టెండర్లను నిపుణుల బృందం అధ్యయనం చేయనుంది.

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబునాయుడు సర్కార్ అవకతవకలకు పాల్పడిందని వైసీపీ ఆరోపణలు చేసింది. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత రివర్స్ టెండర్ ప్రక్రియను ప్రారంభించనున్నట్టు జగన్ ప్రకటించారు.

రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనాన్ని ఆదా చేయనున్నట్టు జగన్ తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులపై  ముఖ్యమంత్రి రివ్యూ చేయడం ఇది రెండోసారి. 

click me!