పట్టాలెక్కిన రైల్లు... విజయవాడలో బారులుదీరిన ప్రయాణికులు

By Arun Kumar P  |  First Published Jun 1, 2020, 12:00 PM IST

 దాదాపు రెండున్నర నెలలుగా స్టేషన్లకే పరిమితమైన రైల్లు సోమవారం నుండి పట్టాలెక్కాయి. దీంతో విజయవాడ రైల్వే స్టేషన్లో పరిసరాలు రద్దీగా మారాయి. 


విజయవాడ: దాదాపు రెండున్నర నెలలుగా స్టేషన్లకే పరిమితమైన రైల్లు సోమవారం నుండి పట్టాలెక్కాయి. దీంతో విజయవాడ రైల్వే స్టేషన్లో పరిసరాలు రద్దీగా మారాయి. వివిద ప్రాంతాలకు వెళ్లేందుకు రైల్వేస్టేషన్ వద్దకు చేరుకున్న ప్రయాణికులు రైల్వే శాఖ  నిబంధనల కారణంగా స్టేషన్ బయట బారులుదీరాల్సి వస్తోంది. కరోనా విజృంభణ, లాక్ డౌన్ కారణంగా ఇంతకాలం వెలవెలబోయిన రైల్వే ప్రాంగణం ప్రస్తుతం ప్రయాణికులతో కళకళలాడుతోంది. 

నేటి నుంచి రైళ్లు మళ్లీ ప్రారంభం కావడంతో పెద్ద సంఖ్యలో  రైల్వే స్టేషన్ కు చేరుకుంటున్నారు ప్రయాణికులు. అయితే రైలు బయలుదేరే సమయానికి 90 నుంచి 120 నిమిషాల ముందే స్టేషన్‌కు చేరుకోవాలన్న నిబంధన మేరకు కొన్ని గంటల ముందగానే ప్రయాణికులు స్టేషన్ కు చేరుకుంటున్నారు. ఇలా వందల సంఖ్యలో ప్రయాణికులు చేరుకుంటున్నారు. 

Latest Videos

ప్రయాణికులకు పరీక్షల అనంతరమే స్టేషన్లోకి పంపిస్తున్నారు అధికారులు. ఎలాంటి కరోనా లక్షణాలు లేనివారిని మాత్రమే స్టేషన్లోకి వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. దీంతో భారీసంఖ్యంలో ప్రయాణికులు రోడ్గుపైనే బారులుతీరాల్సి వస్తోంది. ఇక స్టేషన్‌ లోపల ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా నేలపై గుర్తులు వేశారు. వాటిని ప్రతి ఒక్కరూ  పాటించాలని అధికారులు సూచించారు. 

click me!