శ్రీకాళహస్తిలో దారుణం: నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య

Published : Sep 09, 2021, 03:02 PM IST
శ్రీకాళహస్తిలో దారుణం: నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య

సారాంశం

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఇమ్రాణ్ ఖాన్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కొట్టి చంపారు ఇమ్రాన్ కు చాలామందితో గొడవలున్నాయని పోలీసులు గుర్తించారు. ఇమ్రాన్ ను కొడుతున్న దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి.

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి పట్టణంలో ఇమ్రాన్ ఖాన్ అనే యువకుడిని కొందరు వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు. పాత కక్షల నేపథ్యంలో అతడిని చంపినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్‌కి పలువురితో గొడవలున్నాయని పోలీసులు గుర్తించారు.  

ఈ గొడవల నేపథ్యంలోనే  ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురైనట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నడిరోడ్డుపై ఇమ్రాన్ ఖాన్ ను రాడ్లతో కొడుతున్న దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి.ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు కూడ తమ వాహనాలను వెనక్కి తిప్పుకొన్నారు. తీవ్రంగా గాయపడిన ఇమ్రాన్ ను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు. ఇమ్రాన్ ఖాన్ ను హత్య చేసిన ఘటన సీపీటీవీల్లో రికార్డైంది.  సీసీటీవీ పుటేజీ ఆధారంగా పోలీసులు నిందితు కోసం గాలిస్తున్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu