పది రోజుల్లో చనిపోతా .. మూడు రోజుల్లో బతికొస్తా : కృష్ణా జిల్లాలో పాస్టర్ వ్యాఖ్యలు కలకలం

Siva Kodati |  
Published : Nov 20, 2022, 06:52 PM IST
పది రోజుల్లో చనిపోతా .. మూడు రోజుల్లో బతికొస్తా : కృష్ణా జిల్లాలో పాస్టర్ వ్యాఖ్యలు కలకలం

సారాంశం

కృష్ణా జిల్లాలో పాస్టర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తాను పది రోజుల్లో చనిపోతానని, తిరిగి పది రోజుల్లో బ్రతికొస్తానని చెబుతూ ఫ్లెక్సీలు, పోస్టర్లు కట్టించాడు. 

ఓ వైపు భారతదేశం శాస్త్ర , సాంకేతిక రంగాల్లో అగ్ర రాజ్యాలతో పోటీపడుతుంటే... ఇంకా దేశాన్ని మూఢనమ్మకాలు పట్టి పీడిస్తూనే వున్నాయి. జంతు బలులు, నరబలులు, క్షుద్రపూజలు, మంత్రగాళ్ల గురించి ప్రతిరోజూ వార్తల్లో వింటూనే వున్నాం. తాజాగా కృష్ణా జిల్లాలో ఓ పాస్టర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చస్తున్నాయి. 

వివరాల్లోకి వెళితే.. గన్నవరానికి చెందిన పాస్టర్ నాగభూషణం తాను పది రోజుల్లో చనిపోయి తిరిగి సమాధి నుంచి మళ్లీ తిరిగొస్తానంటూ ఫ్లెక్సీలు కట్టించుకున్నాడు. మాటలు చెప్పడమే కాదు.. గొల్లనపల్లిలో వున్న తన స్థలంలో సమాధి కోసం గొయ్యిని తవ్వించుకుని రెడీగా పెట్టుకున్నాడు. తాను చనిపోతే ఇదే సమాధిలో పెట్టాలని.. మళ్లీ మూడు రోజుల్లో తిరిగొస్తానని చెప్పాడు. కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు కూడా చెప్పాడు. దీంతో ఏం జరుగుతోందో తెలియక గ్రామస్తులు కంగారు పడుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం గన్నవరం పరిసర ప్రాంతాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 
 

PREV
click me!

Recommended Stories

స్థానిక ఎన్నికల పోరుకు సిద్ధం పూనకాలు తెపించే జగన్ స్పీచ్ | Asianet News Telugu
Jogi Ramesh vs Meghana | బైబిల్ చదివితే తప్పా.. పూజ చేయాలన్న భయమేసేది | Controversy