గంజాయి తరలింపు కేసులో టీడీపీకి చెందిన మహిళా నేత జాహ్నవిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.
గుంటూరు: గంజాయి తరలింపు కేసులో TDP కి చెందిన మహిళా నేతJahanavi,ని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.2013లో సైబరాబాద్ లో నమోదైన కేసులో జాహ్నవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఇవాళ ఉమ్మడి Guntur జిల్లా Narasaraopet కు చెందిన టీడీపీ మహిళా జాహ్నవిని అరెస్ట్ చేశారు. ఇదే కేసులో మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.NDPC యాక్ట్ కింది నలుగురిపై 2013లో పోలీసులు కేసు నమోదు చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో గంజాయి సాగు దారులు, సరపరాదారులపై నిఘాను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున కేసులు నమోదు చేస్తున్నారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ని ఏజెన్సీ ప్రాంతం నుండి పెద్ద ఎత్తున గంజాయిని సరఫరా చేస్తున్నారనే విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఇటీవల కాలంలో ఈ విషయమై కేసులు కూడా నమోదయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు కూడా విశాఖ ఏజన్సీ నుండి గంజాయి,. హ్యాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న విషయాన్ని కూడా పోలీసులు గుర్తించారు. గత మాసంలో తెలంగాణలో హ్యాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి విశాఖ జిల్లా నుండే గంజాయితో పాటు హ్యాష్ ఆయిల్ సరఫరా చేస్తున్నారని పోలీసులు గుర్తించారు.
undefined
also read:విజయవాడ లంబాడీపేటలో గంజాయి బ్యాచ్ వీరంగం: ఐదు బైక్ ల దగ్ధం
అనకాపల్లి జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ 18న గోనే సంచుల మాటున గంజాయి సరఫరా చేస్తున్న వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. యూపీ రాష్ట్రానికి చెందిన ట్రక్ విశాఖపట్టణం నుండి హైద్రాబాద్ వైపు వెళ్తుంది. ఈ ట్రక్ అనకాపల్లి జిల్లా గొబ్బూరు వద్ద అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ట్రక్ లో గోనె సంచుల లోడ్ మధ్యలో గంజాయిని సరఫరా చేస్తున్నారు. ప్రమాదానికి గురైన సమయంలో ట్రక్ నుండి గంజాయి బయట పడింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన సమాచారంతో డీఆర్ఐ అధికారులు గంజాయిని సీజ్ చేశారు.1,169.3 కిలోల గంజాయిని డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. దీని విలువ రూ. 2.33 కోట్లుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ ఏడాది జనవరి మాసంలో విశాఖలో ఎన్‌ఏడీ జంక్షన్ వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు సంయుక్తంగా దాడి జరిపి డ్రగ్స్ సీజ్ చేశారు. ఈ కేసులో ఒక యువతిని, మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందుతులు. హైదరాబాద్‌కు చెందిన గీత, మాలవ్వ, విశాఖకు చెందని హేమంత్, రాజాంకు చెందిన డాక్టర్ పృథ్వీలుగా గుర్తించారు. వీరి వద్ద నుంచి టాబ్లెట్ల రూపంలో ఉన్న 18 పిల్స్, 2 ఎండిఎం పిల్స్ స్వాధీనం చేసుకున్నారు.
గత ఏడాది నవంబర్ మాసంలో బెంగుళూరు నుండి కొకైన్ తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కాలేజీ విద్యార్ధులను లక్ష్యంగా చేసుకొని డ్రగ్స్ తె్తున్నారని పోలీసులు గుర్తించారు. ఓ రౌడీషీటర్ డ్రగ్స్ కేసులో కీలకంగా వ్యవహరించారని పోలీసులు చెబుతున్నారు.