పరువు హత్య: కూతుర్ని చంపిన తండ్రి

Published : Jun 28, 2019, 05:20 PM ISTUpdated : Jun 29, 2019, 10:54 AM IST
పరువు హత్య: కూతుర్ని చంపిన తండ్రి

సారాంశం

చిత్తూరు జిల్లా ఉసరపెంటలో పరువు హత్య జరిగింది. కులాంతర వివాహం చేసుకొందనే నెంపతో  తల్లిదండ్రులే కూతుర్ని హత్య చేశారు. మృతదేహాన్ని బావిలో వేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


చిత్తూరు: చిత్తూరు జిల్లా ఉసరపెంటలో పరువు హత్య జరిగింది. కులాంతర వివాహం చేసుకొందనే నెంపతో  తల్లిదండ్రులే కూతుర్ని హత్య చేశారు. మృతదేహాన్ని బావిలో వేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

తమ మాట వినకుండా వేరే కులానికి చెందిన వ్యక్తిన వివాహం చేసుకొందని  కుటుంబసభ్యులు కక్ష పెంచుకొన్నారు. ఏడాది క్రితం ఆ యువతి తాను ప్రేమించిన యువకుడిని వివాహం చేసుకొంది. ఇటీవలనే ఆమె ఓ  మగబిడ్డకు జన్మనిచ్చింది.

బిడ్డను తీసుకొని స్వగ్రామానికి వెళ్తున్న సమయంలో  కుటుంబసభ్యులు వెంటాడి  హత్య చేశారు. మృతదేహాన్ని  బావిలో వేశారు. ఈ విషయమై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కూతురిని తానే హత్య చేసినట్టుగా తండ్రి భాస్కర్ నాయుడు పోలీసుల ముందు ఒప్పుకొన్నాడు.

PREV
click me!

Recommended Stories

శ్రీ సిటీలో బాయిలర్ పేలుడుతో మాకు ఎలాంటి సంబంధం లేదు.. ట్యాబ్లెట్ ఇండియా క్లారిటీ
చంద్రబాబుపై శివరాజ్ సింగ్ పొగడ్తలు | Shivraj Singh Speech | Asianet Telugu