తూర్పు గోదావరిలో హైటెన్షన్: ఒక ఉద్యోగం కోసం గ్రామస్తుల మధ్య ఘర్షణ

By Siva KodatiFirst Published Jun 4, 2020, 4:11 PM IST
Highlights

తూర్పు గోదావరి జిల్లాలో ఓ ఉద్యోగం కోసం రెండు వర్గాలు కొట్టుకున్నాయి. ఉప్పలగుప్తం మండలం ఎస్. కొత్తపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకంలోని ఫీల్డ్ అసిస్టెంట్‌ను తొలగించి కొత్తవారిని నియమించాలనే చర్చ గ్రామంలో నడుస్తోంది

తూర్పు గోదావరి జిల్లాలో ఓ ఉద్యోగం కోసం రెండు వర్గాలు కొట్టుకున్నాయి. ఉప్పలగుప్తం మండలం ఎస్. కొత్తపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకంలోని ఫీల్డ్ అసిస్టెంట్‌ను తొలగించి కొత్తవారిని నియమించాలనే చర్చ గ్రామంలో నడుస్తోంది. దీని కోసం గ్రామంలోని రెండు వర్గాలు పోటీ పడ్డాయి.

ఫీల్డ్ అసిస్టెంట్‌ను తొలగించేందుకు ప్రయత్నిస్తున్న ఓ కార్యకర్త తన చేయి పట్టుకున్నారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో భాగంగా అది తప్పుడు ఫిర్యాదని తేలింది.

ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు గ్రామస్తులు ఓ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. 

click me!