చందన బ్రదర్స్ పిటిషన్:జగన్‌ సర్కార్‌కు హైకోర్టులో చుక్కెదురు

Published : Jul 11, 2019, 04:53 PM IST
చందన బ్రదర్స్ పిటిషన్:జగన్‌ సర్కార్‌కు హైకోర్టులో చుక్కెదురు

సారాంశం

కృష్ణా నదిపై నిర్మించిన చందన బ్రదర్స్ భవనం కూల్చివేతపై మూడు వారాల పాటు గురువారం నాడు హైకోర్టు స్టే విధించింది.  

అమరావతి:కృష్ణా నదిపై నిర్మించిన చందన బ్రదర్స్ భవనం కూల్చివేతపై మూడు వారాల పాటు గురువారం నాడు హైకోర్టు స్టే విధించింది.

కృష్ణా నది కరకట్టపై అక్రమంగా నిర్మించిన కట్టడాలకు సీఆర్‌డీఏ  నోటీసులు జారీ చేసింది. చందన బ్రదర్స్ భవన యజమానులకు కూడ నోటీసులు జారీ అయ్యాయి.ఈ విషయమై చందన బ్రదర్స్ యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. 

ఈ పిటిషన్‌పై  గురువారం నాడు  విచారించింది. సీఆర్డీఏకు అసలు నోటీసులు జారీ చేసే అధికారమే లేదని  పిటిషన్ తరపు న్యాయవాది హైకోర్టును కోరారు.సీఆర్‌డీఏ ఏర్పాటు కాకముందే  తమ భవనాలను నిర్మించినట్టుగా  హైకోర్టుకు పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పారు. అనుమతులు లేకపోతే జరిమానాను విధించాలని పిటిషనర్ కోరారు. చందన బ్రదర్స్ భవనాల కూల్చివేయకుండా మూడు వారాల పాటు హైకోర్టు స్టే విధించింది.
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం
CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu