చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు... తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు

Published : Jun 05, 2020, 10:17 AM ISTUpdated : Jun 05, 2020, 10:24 AM IST
చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు... తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు

సారాంశం

 దేశంలో నైరుతి రుతుపవనాల వ్యాప్తి కొనసాగుతోంది. ప్రస్తుతం ఇవి కర్వార్, హస్సన్, కన్యాకుమారి, కోయంబత్తూర్ వరకూ వ్యాపించాయి.  

విశాఖపట్నం: దేశంలో నైరుతి రుతుపవనాల వ్యాప్తి కొనసాగుతోంది. ప్రస్తుతం ఇవి కర్వార్, హస్సన్, కన్యాకుమారి, కోయంబత్తూర్ వరకూ వ్యాపించాయి. రానున్న రెండు రోజుల్లో మధ్య అరేబియా సముద్రం, కర్నాటక, తమిళనాడు, పుదుచ్చెరి, కరైక్కల్, నైరుతి, తూర్పు మధ్య బంగాళాఖాతాల్లోకి రుతుపవనాలు వ్యాపిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 

ఈనెల ఎనిమిది నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడవచ్చని... ఇది బలపడితే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు దాదాపు పొడివాతావరణమే ఉంటుందని...రేపు, ఎల్లుండి కోస్తాంధ్ర, రాయలసీమ, యానాంలలో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించారు. ఎల్లుండి తెలంగాణలో కూడా వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 

read more   ఏపి ప్రజలకు హెచ్చరిక...రాష్ట్రంలో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు

ప్రతిసారి దోబూచులాడే రుతుపవనాలు ఈసారి అనుకున్న సమయానికి కేరళను తాకాయని భారత వాతావరణ శాఖా ప్రకటించింది. అరేబియా సముద్రంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా కేరళలో భారీగా వర్షాలు కురుస్తున్నాయని, ఈ కారణంగానే నిసర్గ తుఫాన్‌ ఏర్పడిందని తెలిపారు. ఈ అల్పపీడనం కారణంగానే రుతుపవనాల్లో త్వరితమైన కదలికలు ఏర్పడి కేరళను తాకేలా చేశాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  
 

PREV
click me!

Recommended Stories

Chilakaluripet Road Incident: ప్రైవేట్ బస్సు - ఆటో ఢీ.. 7 గురు మృతి! | Asianet Telugu
AP Road Accident : చిలకలూరిపేట రోడ్డు ప్రమాదానికి కారణమేంటో తెలుసా?