నెల్లూరులో మళ్లీ కుళ్లిన మాంసం కలకలం... ఇది తింటే

Siva Kodati |  
Published : Dec 24, 2022, 02:32 PM ISTUpdated : Dec 24, 2022, 02:34 PM IST
నెల్లూరులో మళ్లీ కుళ్లిన మాంసం కలకలం... ఇది తింటే

సారాంశం

నెల్లూరులో మరోసారి భారీ స్థాయిలో కుళ్లిన చికెన్‌ను అధికారులు గుర్తించారు. ఈ చికెన్‌ను చెన్నై, కోయంబత్తూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ నిల్వ వుంచినట్లు అధికారులు గుర్తించారు.   

నెల్లూరులో మరోసారి భారీ స్థాయిలో కుళ్లిన చికెన్‌ను అధికారులు గుర్తించారు. నగరంలోని హరినాథపురంలోని ఓ దుకాణంలో నిల్వ వుంచిన కుళ్లిపోయిన చికెన్‌ను కార్పోరేషన్ అధికారులు సీజ్ చేశారు. ఈ చికెన్‌ను చెన్నై, కోయంబత్తూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ నిల్వ వుంచినట్లు అధికారులు గుర్తించారు. 

కాగా.. గత నెలలోనూ నెల్లూరులో కుళ్లిన చికెన్ వెలుగులోకి వచ్చింది. వెంకటేశ్వరపురంలోని బిస్మిల్లా చికెస్ స్టాల్‌లో వున్న రెండు ఫ్రీజర్లలో రోజుల పాటు నిల్వ వుంచిన మాంసాన్ని గుర్తించారు. దీనిని స్వాధీనం చేసుకుని డంపింగ్ యార్డ్‌కు తరలించి చికెన్ సెంటర్‌ను సీజ్ చేశారు.చెన్నై, చిత్తూరు నుంచి ఈ మాంసం తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు. 
 

PREV
click me!

Recommended Stories

తిరుమల వైకుంఠ ద్వార దర్శనంచేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu
Tirumala Vaikunta Ekadashi: వైకుంఠ ఏకాదశి పర్వదినాన తిరుమలలో స్వర్ణరథం | Asianet News Telugu