తుపాకీతో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం...

By Arun Kumar PFirst Published Sep 17, 2018, 3:48 PM IST
Highlights

ఓ హెడ్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. డ్యూటీలో ఉండగానే తుపాకీతో చాతీపై కాల్చుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే రక్తపు మడుగులో పడివున్న అతన్ని సహచరులు ఆస్పత్రికి తరలిస్తుండగా తనను కాపాడవద్దంటూ హల్చల్ చేశాడు. వాహనంలోంచి దూకి నానా హంగామా చేశాడు. అయితే ఎట్టకేలకు అతన్ని ఆస్పత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు.
 
తూర్పు గోదావరి జిల్లా కూనవరం పోలీస్ స్టేషన్లో శ్రీనివాస్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. ఇతడి స్వస్థలం కాకినాడ. అయితే ఆదివారం ఉదయం డ్యూటీకి హాజరైన శ్రీనివాస్ హటాత్తుగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్లోనే తుపాకీతో ఛాతీపై రెండురౌండ్లు కాల్చుకున్నాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడిని సహచరులు భద్రాచలం ఆస్పత్రికి తరలించారు.

అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం విజయవాడ కు తరలిస్తుండగా శ్రీనివాస్ హల్ చల్ సృష్టించాడు. తరలిస్తున్న వాహనం నుండి కిందికి దూకి తనను కాపాడవద్దంటూ పారిపోడానికి ప్రయత్నించాడు. అయితే అతన్ని అతికష్టం మీద పట్టుకున్న సిబ్బంది ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు,. కుటుంబ కలహాల వల్లే శ్రీనివాస్ ఆత్మహత్యకు పాల్పడివుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

click me!