వైసీపీలో చిచ్చు: రెండు వర్గాలుగా చీలిక, ఎమ్మెల్యేపై తిరగబడ్డ వైసీపీ నేతలు

By Nagaraju penumalaFirst Published Jul 20, 2019, 9:45 PM IST
Highlights

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ అప్పటి ఎంపీ వరప్రసాద్ తోళ్ల పరిశ్రమను వ్యతిరేకిస్తూ ప్రజల వైపు నిలబడ్డారని వైసీపీ నేతలు ఆరోపించారు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే వరప్రసాద్ ప్రజల పక్షాన ఉండకుండా పరిశ్రమ ప్రతినిధులకు అండగా నిలవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 


నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న తోళ్ల పరిశ్రమ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చిచ్చుపెట్టింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెండు వర్గాలుగా చీల్చేసింది. వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ ఒక వర్గం, పేర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డి మరో వర్గంగా చీలిపోయారు. 

తోళ్ల పరిశ్రమ ఏర్పాటుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ వేదికగా ఈ వ్యవహారం అంతా నడిచింది. తోళ్ల పరిశ్రమ తమ కొద్దంటూ స్థానికులు నినాదాలు చేశారు. వైసీపీ నేత పేర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డితో కలిసి గ్రామస్థులు ప్రజాభిప్రాయ సేకరణ అడ్డుకున్నారు. 

ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్న సబల్ కలెక్టర్ కాళ్లు పట్టుకున్నారు పేర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డి. తమకు తోళ్ల పరిశ్రమ వద్దంటూ బ్రతిమిలాడారు. దీంతో ఆగ్రహం చెందిన ఉద్యమకారులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. 

గూడురు ఎమ్మెల్యే వరప్రసాద్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగితాలు విసిరి తమ నిరసన వ్యక్తం చేశారు. తోళ్ల పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలంగా కోట్లాది రూపాయలు చేతులు మారాయంటూ ఆరోపించారు. దీంతో అర్థాంతరంగా ప్రజాభిప్రాయసేకరణను రద్దు చేసి వెళ్లిపోయారు సబ్ కలెక్టర్.

ఇకపోతే నెల్లూరు జిల్లా కోట మండలం కొత్తపట్టణంలో తోళ్ల పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఎనిమిదేళ్ల క్రితం ఆనాటి ప్రభుత్వం నిర్ణయించింది. ఎనిమిదేళ్లుగా తోళ్ల పరిశ్రమను తీరప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.  

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తోళ్ల పరిశ్రమ వ్యవహారం తెరపైకి వచ్చింది. దీంతో సబ్ కలెక్టర్ నేతృత్వంలోని ఒక కమిటీ ప్రజాభిప్రాయ సేకరణకు శనివారం వెళ్లింది. గ్రామస్తులు ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకున్నారు. కుర్చీలు విసురుతూ నిరసన గళం విప్పారు.

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ అప్పటి ఎంపీ వరప్రసాద్ తోళ్ల పరిశ్రమను వ్యతిరేకిస్తూ ప్రజల వైపు నిలబడ్డారని వైసీపీ నేతలు ఆరోపించారు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే వరప్రసాద్ ప్రజల పక్షాన ఉండకుండా పరిశ్రమ ప్రతినిధులకు అండగా నిలవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పరిశ్రమ  ప్రతినిధులకు ఎమ్మెల్యే వరప్రసాద్ అమ్ముడుపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైపు నిలబడకుండా పరిశ్రమ ప్రతినిధులకు అండగా నిలిచారు. దీంతో వరప్రసాద్ తీరుపై వైసీపీ నేతలు, కార్యకర్తలు తిరగబడ్డారు. పరిశ్రమ ప్రతినిధులకు ఎమ్మెల్యే అమ్ముడు పోయారంటూ ఆరోపించారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

click me!