రాత్రి ప్రేమ పెళ్లి... ఉదయాన్నే వరుడు పరార్

Published : Oct 12, 2019, 07:54 AM IST
రాత్రి ప్రేమ పెళ్లి... ఉదయాన్నే వరుడు పరార్

సారాంశం

నాలుగు నెలలుగా వెంట పడటంతో... అతనిని నమ్మి ఇంట్లో ఎవరికీ తెలియకుండా గురువారం రాత్రి అతనితోపాటు వెళ్లిపోయింది. అక్కడి నుంచి యువకుడు బాలికను ఓ గుడికి తీసుకువెళ్లాడు. అక్కడ పెళ్లి చేసుకున్నాడు. ఆ రాత్రంతా బాలికతో గడిపాడు. ఉదయం బాలిక నిద్ర లేచి చూసేసరికి యువకుడు పరారయ్యాడు.  

ప్రేమించానన్నాడు. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. ఇంట్లో వాళ్లకు ఎవరికీ తెలియకుండా బాలికను తీసుకొని వెళ్లిపోయాడు. రాత్రికి రాత్రి గుడిలో పెళ్లి చేసుకున్నాడు. ఆ రాత్రంతా ఆ బాలికతోనే గడిపి..  ఉదయాన్నే ఆమెకు అక్కడ వదిలేసి పరారయ్యాడు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా పోలాకిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... పోలాకి మండలానికి చెందిన ఓ బాలిక ఇంటర్ విద్యనభ్యసిస్తోంది. ప్రతి రోజూ సైకిల్ మీద కాలేజీకి వెళ్లేది. కాగా... బాలిక కాలేజీకి వెళ్తున్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఆమె వెంట పడేవాడు. ప్రమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.

అతని మాటలను యువతి కూడా నిజమని నమ్మేసింది. నాలుగు నెలలుగా వెంట పడటంతో... అతనిని నమ్మి ఇంట్లో ఎవరికీ తెలియకుండా గురువారం రాత్రి అతనితోపాటు వెళ్లిపోయింది. అక్కడి నుంచి యువకుడు బాలికను ఓ గుడికి తీసుకువెళ్లాడు. అక్కడ పెళ్లి చేసుకున్నాడు. ఆ రాత్రంతా బాలికతో గడిపాడు. ఉదయం బాలిక నిద్ర లేచి చూసేసరికి యువకుడు పరారయ్యాడు.

చాలా సేపు ఎదురుచూసినా రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాలిక వెంటనే ఈ విషయాన్ని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు తెలియజేసింది. వారి సహాయంతో బాలిక పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

AP Power Sector : ఏపీకి కొత్త పవర్ ప్లాన్.. తీరనున్న కరెంట్ కష్టాలు..భవిష్యత్ కోసం బ్యాటరీ స్టోరేజ్
IRCTC Tirupati Kolhapur Tour: ఒక్క టికెట్ తో తిరుమల శ్రీవారి నుంచి కొల్హాపూర్ అమ్మవారి దర్శనం వరకు.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్