కేటీఆర్! తెలంగాణలో నీ పని చూసుకో!!: మంత్రి గంటా వార్నింగ్

Published : Feb 25, 2019, 07:24 AM ISTUpdated : Feb 25, 2019, 07:37 AM IST
కేటీఆర్! తెలంగాణలో నీ పని చూసుకో!!: మంత్రి గంటా వార్నింగ్

సారాంశం

విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీలో 100శాతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ ఏపీపై కాకుండా తెలంగాణలో అభివృద్ధిపై దృష్టిపెడితే మంచిదని హితవు పలికారు. మీపనేదే చూసుకోవాలని సూచించారు.   

విశాఖపట్నం: టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కేటీఆర్ జోస్యం ఫలించదని చెప్పుకొచ్చారు. కచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. 

విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీలో 100శాతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ ఏపీపై కాకుండా తెలంగాణలో అభివృద్ధిపై దృష్టిపెడితే మంచిదని హితవు పలికారు. మీపనేదే చూసుకోవాలని సూచించారు. 

మరోవైపు ప్రధాని నరేంద్రమోదీ పర్యటనపై కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ప్రధాని మోదీ పర్యటనకు ప్రజల నుంచి నిరసనలు తప్పవని హెచ్చరించారు. విశాఖ పర్యటనలో మోదీ రైల్వేజోన్ పై ప్రకటన చేసినా ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. ఇకపోతే ఏయూలో క్లాసులు జరుగుతున్నాయని తెలిపారు. ఏయూ గ్రౌండ్‌లో సభలకు అనుమతిలేదని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

ఏపీలో నిరుద్యోగుల‌కు పండ‌గ‌లాంటి వార్త‌.. 10,060 పోస్టుల భ‌ర్తీకి గ్రీన్ సిగ్న‌ల్
ఈ ప్రాంతాల్లో అల్ల‌క‌ల్లోల‌మే.. ఉరుములు, మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షాలు