గంటా శ్రీనివాస రావు : బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం  

Rajesh KPublished : Mar 24, 2024 6:38 AM
గంటా శ్రీనివాస రావు : బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం  

సారాంశం

Ganta Srinivasa Rao Biography: ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు, జగన్ స్థాయిలో ఎక్కువగా వినిపించే పేరు గంటా శ్రీనివాస రావు (Ganta Srinivasa Rao). చంద్రబాబుకు అత్యంత విశ్వాస పాత్రుడు. ఆయన ఏ పార్టీలో ఉన్నా.. ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలువాల్సిందే. 2024 ఎన్నికల్లో భాగంగా ఆయనకు భీమిలీ టికెట్ ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాస రావు వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని ఆసక్తికర ఆంశాలపై ప్రత్యేక కథనం..

Ganta Srinivasa Rao Biography: 

వ్యక్తిగత జీవితం

గంటా శ్రీనివాసరావు.. 1960 డిసెంబర్ 1న ప్రకాశం జిల్లాలో గండా చిన్న రోశయ్య - గంటా నారాయణమ్మ దంపతులకు జన్మించారు.  ఆయన విద్యాభ్యాసం ప్ర‌కాశం జిల్లాలోని సాగింది. బి.కాం. బి.ఎల్ చదివిన ఆయన కొంతకాలం నాయ్యవాదిగా ప్రాక్టీస్ చేశారు. అయితే.. చిన్ననాటి నుండే రాజకీయాల పైన ఆసక్తి ఉన్న ఆయన టీడీపీలో చేరి అంచలంచెలుగా ఎదిగారు. గంటా శ్రీనివాస్ కు శారదతో వివాహం కాగా.. వారికి ఇద్దరూ సంతానం. కుమారుడు రవితేజ, కూతురు సాయి పూజిత. రవితేజ సినిమాల్లో హీరోగా ప్రయత్నిస్తున్నారు. జై దేవ్ అనే మూవీలో హీరోగా చేశారు. కానీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో తండ్రితో కలిసి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు.  సినిమాలో ఎక్కువగా చూసే గంట శ్రీనివాసరావుకి మెగాస్టార్ చిరంజీవి అంటే అమితమైన అభిమానం. ఆయన పైన అభిమానంతో ప్రజారాజ్యం పార్టీలో చేరారు.

రాజకీయ జీవితం 

1999లో రాజకీయాల్లో ప్రవేశించిన గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao)తొలి ప్రయత్నంలోనే అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీగా గెలుపొందాడు.అనంతరం 2004 ఎన్నికల్లో చోడవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన  తన సమీప ప్రత్యర్థి బాలిరెడ్డి సత్యారావు (కాంగ్రెస్)పై దాదాపు 10వేల ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించాడు.

ప్రజారాజ్యం పార్టీలో చేరిక

ఇక 2009లో తన అభిమాన నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేయడంతో ఆ పార్టీ చేరారు. ఈ ఏడాది ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్ధి కొణతాల రామకృష్ణపై  10866 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కానీ, ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో అఇష్టంగానే కాంగ్రెస్ లో చేరారు. నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రిమండలిలో మంత్రిగా చోటు దక్కించుకున్నారు. 

టీడీపీలోకి రీఎంట్రీ

ఇక రాష్ఠ్ర విభజన తరువాత 2014లో తిరిగి టీడీపీలో చేరారు శ్రీనివాస రావు. 2014 ఎన్నికల్లో  విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి పోటీచేసి.. శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన మంత్రిమండలిలో మానవ వనరుల అభివృద్ధిశాఖ, ప్రైమరీ ఎడ్యుకేషన్‌, సెకండరీ ఎడ్యుకేషన్‌, ఉన్నత, సాంకేతిక విద్యా శాఖల మంత్రిగా పని చేశారు. 2109లో మళ్లీ విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 2021 ఫిబ్రవరి 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను 2024 జనవరి 23న స్పీకర్ ఆమోదించారు. ఉత్తరాంధ్రలో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గంలో గంటా కి మంచి పట్టు ఉంది . తన రాజకీయ జీవితంలో  4 సార్లు ఎమ్మెల్యేగా , ఒకసారి ఎంపీగా గెలుపొందారు. 2024 ఎన్నికల్లో భాగంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు భీమిలీ టికెట్ ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది.
 
వివాదాలు

>> విశాఖపట్నం జిల్లా రాంబిల్లి తహసీల్‌ పరిధిలోని విజయరామపురం అగ్రహారంలో 124 ఎకరాల ప్రభుత్వ భూమిలో గంటా శ్రీనివాసరావు నాలుగు ఎకరాలు ఆక్రమించారని, ఈ భూమిలో అక్రమ కట్టడాలను జగన్ సర్కార్ కూల్చివేసింది.

>> గంటా శ్రీనివాస్‌రావుకు చెందిన ప్రత్యూష కంపెనీ ఇండియన్‌ బ్యాంకుకు వడ్డీతో సహా రూ. 248 కోట్లు బకాయిపడింది. దీంతో ఆయన ఆస్తులను బ్యాంకు వేలం వేయనుంది. హైదరాబాద్, విశాఖపట్నంలోని ఆస్తులను నవంబర్ 25న వేలం వేయాలని బ్యాంక్ నిర్ణయించింది. 

>> 2009లో ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలపై విచారణ సందర్భంగా అనకాపల్లిలోని సెకండ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు నాన్ బెయిలెబుల్ వారెంట్ ను జారీ చేసింది.

>> స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో గంటా శ్రీనివాసరావు అరెస్టయ్యారు. 

గంటా శ్రీనివాసరావు బయోడేటా

పూర్తి పేరు: గంటా శ్రీనివాస‌ రావు
పుట్టిన తేదీ: 01 Dec 1960,(వ‌య‌స్సు  64)
జన్మస్థలం: ప్ర‌కాశం జిల్లా
విద్య:  బీకాం, ఎల్.ఎల్.బీ
వృత్తి: రాజ‌కీయ నాయ‌కుడు
తండ్రి పేరు: చిన్న రోశ‌య్య
తల్లి పేరు: గంటా నారాయ‌ణ‌మ్మ
జీవిత భాగస్వామి: పేరు    శార‌ద‌
పార్టీ పేరు    : తెలుగుదేశం పార్టీ (టీడీపీ)  

PREV
click me!