మూసేసిన పార్టీకి గడపదాటని నాయకుడు చంద్రబాబు.. గడికోట శ్రీకాంత్‌ రెడ్డి ఫైర్..

Published : Nov 04, 2020, 04:38 PM IST
మూసేసిన పార్టీకి గడపదాటని నాయకుడు చంద్రబాబు..  గడికోట శ్రీకాంత్‌ రెడ్డి ఫైర్..

సారాంశం

మూసేసిన పార్టీకి గడపదాటని నాయకుడు చంద్రబాబు అని అతని ఆదేశాల మేరకే ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పనిచేస్తున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి విరుచుకుపడ్డారు. 

మూసేసిన పార్టీకి గడపదాటని నాయకుడు చంద్రబాబు అని అతని ఆదేశాల మేరకే ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పనిచేస్తున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి విరుచుకుపడ్డారు. 

రాజ్యాంగ వ్యవస్థలో ఉంటూ ఎలక్షన్‌ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ నీతి, న్యాయం పాటించకుండా దిగజారి ప్రవర్తిస్తున్నారన్నారు . ఎవరిని టార్గెట్ చేయాలనే ఉద్దేశం తమకు లేదని, వాస్తవాలను ప్రజలకు వివరించే ప్రయత్నమే తాము చేస్తున్నామని స్పష్టం చేశారు. 

ఎన్నికల నిర్వహణకు సిద్దంగా ఉన్నామని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ ‌కుమార్ హైకోర్టులో మంగళవారం అఫిడవిట్ వేసినట్లు పత్రికల్లో వచ్చిందన్నారు. కానీ హైకోర్టులో మాత్రం ఆ అఫిడవిట్ ఈ రోజు ఫైల్ అయినట్లుగా ఉందని పేర్కొన్నారు. హైకోర్టులో ఫైల్ చేసేముందే పత్రికలకు నిమ్మగడ్డ రమేష్ ఎందుకు లీక్ చేశారని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తి నిజాయితీగా వ్యవహరిస్తారని ఎలా నమ్మాలని నిలదీశారు. ఈ విషయంతో చంద్రబాబు ఆదేశాలతో నిమ్మగడ్డ పనిచేస్తున్నట్లు తేలిందన్నారు. 

సొంత ప్రయోజనాల కోసం, స్వార్థం కోసం వ్యవస్థలను తాకట్టు పెడుతున్నారని శ్రీకాంత్‌ రెడ్డి మండిపడ్డారు. రెండు కేసులు వచ్చినపుడు కరోనా పేరు చెప్పి ఎన్నికలను వాయిదా వేసిన ఆయన ఇప్పడు సరాసరిగా ౩ వేల కరోనా కేసులు రోజుకు వస్తున్నాయి. అయినా ఈ పరిస్థితుల్లో ఎన్నికలను నిమ్మగడ్డ రమేష్ ఎలా నిర్వహిస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ద్వివేదిని చంద్రబాబు బెదిరించారని, రాజ్యాంగ  వ్యవస్థలను గౌరవించే తత్వం చంద్రబాబుకు లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు చెప్పినట్లుగా ఎస్ఈసీ రమేష్ పని చేస్తున్నారన్న శ్రీకాంత్‌ రెడ్డి  స్వార్థం కోసం చంద్రబాబు వ్యవస్థలను సర్వనాశనం చేస్తున్నారని విమర్శించారు. ఇంట్లోంచి బయటకు రాని నాయకుడు చంద్రబాబు. జూమ్ మీటింగ్‌లలో ప్రభుత్వంపై చంద్రబాబు బురద జల్లుతున్నారు. 

‘మూసేసిన పార్టీకి గడపదాటని నాయకుడు చంద్రబాబు. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు ఏమీ చేయడం లేదు. అమరావతిలో చంద్రబాబు చేసిన అభివృద్ది శూన్యం. అమరావతిలో చంద్రబాబు అడుగుకు 12వేలు దోచుకుని సర్వనాశనం చేశారు. విజయవాడలో దుర్గ వారధిని కూడా కొద్దిగా చేసి వదిలేస్తే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ పూర్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు పేరిట చంద్రబాబు వేల కోట్లు దోచుకున్నారు. రివర్స్ టెండరింగ్‌లో ప్రభుత్వం 800 కోట్లను మిగిల్చింది. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్