TTD: శ్రీవారి దర్శనాలు కల్పిస్తానని భక్తుల నుంచి లక్షలు మోసం చేసిన కేటుగాడు అరెస్టు.. ఎలా చేశాడంటే?

Published : Nov 20, 2023, 07:49 PM IST
TTD: శ్రీవారి దర్శనాలు కల్పిస్తానని భక్తుల నుంచి లక్షలు మోసం చేసిన కేటుగాడు అరెస్టు.. ఎలా చేశాడంటే?

సారాంశం

కర్ణాటకకు చెందిన ఓ కేటుగాడు అమాయక భక్తుల నుంచి లక్షల రూపాయాలు మోసం చేశాడు. శ్రీవారి దర్శనం టికెట్లు ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు గుంజాడు. తాజాగా, పోలీసులు ఆ మోసగాడిని అరెస్టు చేశారు.  

హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానానికి దేశవ్యాప్తంగా ఖ్యాతి ఉన్నది. దేశవ్యాప్తంగా ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజలు శ్రీవారిని ఎక్కువగా దర్శిస్తుంటారు. ఇదే అదునుగా తీసుకుని ఓ కేటుగాడు మోసాలకు తెరలేపాడు. తాజాగా పోలీసులు ఆ మోసగాడిని అరెస్టు చేశాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఎలహంకకు చెందిన మోసగాడు హెచ్ మారుతిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మోసగాడు శ్రీవారి దర్శనం టికెట్లు ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు గుంజాడు.

కర్ణాటకకు చెందిన నలుగురి వద్ద నుంచి రూ. 42 వేలు ఇందుకోసం తీసుకున్నాడు. ఇలాగే మరో అడ్వకేట్ దగ్గర కూడా డబ్బులు దండుకున్నాడు. బళ్లారికి చెందిన ఓ అడ్వకేట్‌కు లైఫ్ టైం డోనార్ టికెట్లు ఇప్పిస్తానని నమ్మించాడు. అందుకోసం రూ. 28 లక్షల టోపీ పెట్టాడు.

Also Read : Caste: కాబోయే భర్త ఇంటిలో నవవధువు మృతి.. తక్కువ కులం అని చంపేశారు: యువతి తల్లిదండ్రులు

వీరంతా ఈ కేటుగాడిని నమ్మడానికి ఓ బలమైన కారణం ఉన్నది. టీటీడీ బోర్డ్ మెంబర్‌ వద్ద ఈ మారుతి పీఆర్వోగా పని చేశాడు. తన పొజిషన్‌ను అక్రమంగా ఉపయోగించుకున్నాడు. తానే టీటీడీ బోర్డు మెంబర్ అని బిల్డప్ ఇస్తూ ఫోన్లు చేసి డబ్బులు వసూలు చేసుకున్నాడు. ఈ మోసగాడిని పట్టుకోవడానికి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఒక టీం ఏర్పాటు చేశారు. మారుతీ బెంగళూరులో ఉన్నట్టు సమాచారం అందంది. దీంతో తిరుమల టూ టౌన్ పోలీసులు మారుతీని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

President Droupadi Murmu At Vijayawada Kanakadurga Devi Temple | Asianet Telugu
ద్రౌపదమ్మకు చీర బహుమతిగా ఇచ్చిన అనితమ్మ | Asianet Telugu