కర్నూల్ జిల్లాలో అతిసార: నలుగురి మృతి, మరో 25 మందికి అస్వస్థత

By narsimha lodeFirst Published Apr 7, 2021, 10:40 AM IST
Highlights

కర్నూల్ జిల్లాలో అతిసారతో నలుగురు మరణించారు. మరో 30 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులు వైద్యులను ఆదేశించారు.

కర్నూల్: కర్నూల్ జిల్లాలో అతిసారతో నలుగురు మరణించారు. మరో 30 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులు వైద్యులను ఆదేశించారు.

జిల్లాలోని ఆదోని పట్టణంలోని అరుంజ్యోతి నగర్, పాణ్యం మండలంలోని గోరుకల్లు లో   అతిసారతో ప్రజలు  అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారు ఆదోని  ,  నంద్యాలలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 6వ తేదీన ఇద్దరు. ఈ నెల 7న మరో ఇద్దరు మరణించారు. ఇంకా  25 మంది నంద్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

నంద్యాలలోని అరుణజ్యోతి నగర్, ఆదోనిలోని గోరుకల్లులో అతిసార ప్రజల ప్రాణాలను తీసింది.  గోరుకల్లులో మూడు రోజులుగా కలుషిత నీరు తాగి ప్రజలు అస్వస్థతకు గురౌతున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో నలుగురు మృతి చెందారు.ఈ రెండు గ్రామాలకు గోరుకల్లు రిజర్వాయర్ నుండి నీరు సరఫరా అవుతోంది. మరోవైపు  మంచినీరు సరఫరా చేసే పై‌ప్‌లైన్ లో మురికి నీరు కలవడం వల్ల ప్రజలు అస్వస్థతకు గురౌతున్నారని అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

గోరుకల్లులో వైద్య సిబ్బంది అతిసార బాధితులకు చికత్స అందిస్తున్నారు. ఆదోనిలోని అరుణజ్యోతి నగర్ లో ఇవాళ ఉదయం నుండి  అతిసార వ్యాధిగ్రస్తుల రోగుల సంఖ్య పెరుగుతుంది.
 

click me!