దివ్యాంగుడి దారుణహత్య: అక్రమ బంధానికి అడ్డుగా ఉన్నాడని.. భార్య ప్రియుడే

Siva Kodati |  
Published : Oct 04, 2020, 09:44 PM ISTUpdated : Oct 04, 2020, 11:00 PM IST
దివ్యాంగుడి దారుణహత్య: అక్రమ బంధానికి అడ్డుగా ఉన్నాడని.. భార్య ప్రియుడే

సారాంశం

నెల్లూరు జిల్లా కలవకొండలో సంచలనం సృష్టించిన దివ్యాంగుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే భార్య ప్రియుడు మరో ముగ్గురితో కలిసి హత్యకు పాల్పడినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది

నెల్లూరు జిల్లా కలవకొండలో సంచలనం సృష్టించిన దివ్యాంగుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే భార్య ప్రియుడు మరో ముగ్గురితో కలిసి హత్యకు పాల్పడినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.

వివరాల్లోకి వెళితే.. కలవకొండకు చెందిన చేజర్ల సుబ్రమణ్యం దివ్యాంగుడు. ఇంటి వద్దే టైర్లకు పంక్చర్లు వేస్తూ జీవనం సాగించేవాడు. అతని భార్య సిలికా మైన్‌లో పనిచేసేది. ఈ క్రమంలో ఆమెకు ఉడతావారి పాలెనికి చెందిన ఈతముక్కల కాటయ్యతో పరిచయం ఏర్పడి, అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది.

దీంతో తమ బంధానికి అడ్డుగా ఉన్న సుబ్రమణ్యాన్ని హతమార్చేందుకు గతంలో గూడూరుకు చెందిన అత్తిపట్టు బాలాజీని సంప్రదించాడు. అయితే అతను తన వల్ల కాదని ఓ యువకుడికి చెప్పాడు.

దీంతో ఆ కుర్రాడు సూళ్లూరుపేట హోలీక్రాస్‌ ప్రాంతంలో మెకానిక్‌గా పనిచేస్తున్న మరో మైనర్‌కు సమాచారం ఇచ్చాడు. కాటయ్యతో రూ.40 వేలకు ఒప్పందం చేసుకున్న వీరు 26న ముగ్గురు కలిసి హత్యకు పథకం పన్నారు.

పథకంలో భాగంగా నలుగురు కలవకొండకు చేరుకుని పీకలదాకా మద్యం సేవించారు. అనంతరం సుబ్రహ్మణ్యం ఇంటికి మెకానిక్‌ వెళ్లాడు. రాయితో తలుపును కొట్టి వెంటనే పక్కనే వున్న బస్‌షెల్టర్‌లో తలదాచుకున్నాడు.

అలికిడి విన్న సుబ్రహ్మణ్యం ఏంటా అని బయటకు వచ్చి చూడగా ఎవ్వరూ కనిపించలేదు. అప్పటికే తెల్లవారుజాము కావడంతో కుటుంబ సభ్యులకు చెప్పి బహిర్భూమికి బయలుదేరాడు.

ఇదే అదునుగా భావించిన మెకానిక్ కత్తితో సుబ్రమణ్యంపై దాడి చేసి హత్య చేశాడు. అనంతరం నలుగురు అక్కడి నుంచి పారిపోయారు. అయితే తన బాబాయిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు అతని అన్న కుమారుడు శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

శుక్రవారం  గూడూరు ఎస్‌ఆర్‌ఏ టాకీస్‌ సమీపంలో నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు అధికారులు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లు, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని గూడూరు డీఎస్పీ అభినందించారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : ఆగస్ట్ ముగిసినా ఆగని సెలవులు.. సెప్టెంబర్ లో స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులకు వచ్చే వరుస సెలవులు, లాంగ్ వీకెండ్స్ ఇవే
🤣😂 YS Jagan గులకరాయి డ్రామా | Nara Lokesh Hilarious Speech On YS Jagan | Asianet News Telugu