నా సోదరుడు క్రాస్ ఓటింగ్ చేయడం తప్పే: మేకపాటి రాజమోహన్ రెడ్డి

By narsimha lodeFirst Published Apr 7, 2023, 1:45 PM IST
Highlights

ఎమ్మెల్సీ ఎన్నికల్లో  తన  సోదరుడు  క్రాస్  ఓటింగ్ కు పాల్పడడం  తప్పేనని  మేకపాటి రాజమోహన్ రెడ్డి  చెప్పారు. 

నెల్లూరు: తన మాట వినకుండా  పార్టీకి   తన సోదరుడు నష్టం  చేశారని  మాజీ ఎంపీ  మేకపాటి   రాజమోహన్ రెడ్డి  చెప్పారు.శుక్రవారంనాడు  ఓ తెలుగు న్యూస్ చానెల్ తో  మేకపాటి  రాజమోహన్ రెడ్డి  మాట్లాడారు. ఎమ్మెల్యే  కోటా ఎమ్మెల్సీ  ఎన్నికల్లో  తన  సోదరుడు  మేకపాటి  చంద్రశేఖర్ రెడ్డి  క్రాస్ ఓటింగ్  చేయడం   తప్పేనన్నారు. వచ్చే ఎన్నికల్లో  ఉదయగిరి  టిక్కెట్టు  పార్టీ ఎవరికి  ఇచ్చినా వారి గెలుపునకు  కృషి చేస్తామని   మేకపాటి రాజమోహన్ రెడ్డి  చెప్పారు.

ఎమ్మెల్యే  కోటా  ఎమ్మెల్సీ  ఎన్నికల్లో  టీడీపీ  అభ్యర్ధికి  ఓటు  చేశారని  ఉదయగిరి ఎమ్మెల్యే  మేకపాటి  చంద్రశేఖర్ రెడ్డిని  వైసీపీ నాయకత్వం  సస్పెండ్  చేసింది.  ఎమ్మెల్యే  కోటా  ఎమ్మెల్సీ  ఎన్నికల్లో టీడీపీ  అభ్యర్ధి  పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. పంచముర్తి అనురాధ  విజయం సాధించడంలో   నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు    క్రాస్  ఓటింగ్  చేశారని ఆ పార్టీ నాయకత్వం  నిర్ధారించింది.  ఈ మేరకు  మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి , ఆనం రామనారాయణ రెడ్డి , కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,  ఉండవల్లి శ్రీదేవిలను  సస్పెండ్  చేసింది  పార్టీ నాయకత్వం. 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో  పార్టీ ఆదేశం మేరకు  తాను  ఓటు  చేసినట్టుగా  వైసీపీ ఎమ్మెల్యే  మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు.తనపై  వైసీపీ నాయకత్వం  చేసిన ఆరోపణలను  ఆయన  తప్పుబట్టారు.

also read:మేకపాటి, వినయ్ మధ్య సవాళ్లు: ఉదయగిరి బస్టాండ్ వద్ద టెన్షన్, భారీగా పోలీసుల మోహరింపు

తన  సోదరుడు  రాజమోహన్ రెడ్డి  కోసం తాను  పోరాటం  చేసిన  విషయాన్ని   మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి  గుర్తు  చేశారు.   కానీ తనకు  ఈ సమయంలో రాజమోహన్ రెడ్డి ఎలాంటి సహయం చేసే పరిస్థితిలో లేడన్నారు.వైసీపీ నాయకత్వం తీరుపై  మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అసంతృప్తిలొ ఉన్నారు.  వైసీపీ  కోఆర్డినేటర్  పై  మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి  మీడియా వేదికగా  విమర్శలు  చేశారు.   ఈ విమర్శలు  చేసినా   కొన్ని రోజులకే  ఎమ్మెల్యే  కోటా  ఎమ్మెల్సీ  ఎన్నికల్లో  క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని   మేకపాటి  చంద్రశేఖర్ రెడ్డిపై వైసీపీ  నాయకత్వం  చర్యలు తీసుకుంది.


 

click me!