ఉండవల్లి, హర్షకుమార్‌లతో భేటీ:ఎన్నికల్లో పోటీపై తేల్చేసిన లగడపాటి

By narsimha lode  |  First Published Jan 8, 2024, 2:32 PM IST

రాజమండ్రిలో ఇద్దరు మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్ లతో  మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇవాళ సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.


రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముగ్గురు మాజీ ఎంపీలు  సోమవారం నాడు రాజమండ్రిలో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. మాజీ ఎంపీ హర్షకుమార్, ఉండవల్లి అరుణ్ కుమార్ లతో మాజీ ఎంపీ  లగడపాటి రాజగోపాల్ భేటీ అయ్యారు.

సోమవారం నాడు  రాజమండ్రిలో  అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ తో  మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ భేటీ అయ్యారు. అనంతరం వీరిద్దరూ కలిసి  మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో సమావేశమయ్యారు. ఈ ముగ్గురు మాజీ ఎంపీల భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.  

Latest Videos

undefined

2014కు ముందు  ఈ ముగ్గురు కాంగ్రెస్ పార్టీ ఎంపీలుగా కొనసాగారు . 2014లో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఈ ముగ్గురు రాజకీయాల్లో అంతగా యాక్టివ్ గా లేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నాయకత్వం చర్యలు చేపడుతున్న నేపథ్యంలో  ఈ ముగ్గురి భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ఈ భేటీ ముగిసిన తర్వాత  లగడపాటి రాజగోపాల్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనతోనే తన రాజకీయ జీవితం ముగిసిందని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనతోనే తన రాజకీయ జీవితం ముగిసిందని  రాజగోపాల్ తేల్చి చెప్పారు. రాష్ట్ర విభజన జరిగితే  తాను రాజకీయాల నుండి తప్పుకొటానని  2009లో  ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అందుకే  తాను  2014 నుండి రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టుగా లగడపాటి రాజగోపాల్ చెప్పారు.  

also read:పాదయాత్రలతో రికార్డ్: వైఎస్ఆర్‌సీపీ నుండి కాంగ్రెస్ వరకు షర్మిల ప్రస్థానమిదీ..

రాజమండ్రి వస్తే  మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్ లను కలుస్తానన్నారు. ఇవాళ రాజమండ్రి వచ్చినందున హర్షకుమార్ , ఉండవల్లి అరుణ్ కుమార్ లను  కలిసినట్టుగా  లగడపాటి రాజగోపాల్ వివరించారు.

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై  సర్వేలు నిర్వహించడం లేదని  లగడపాటి రాజగోపాల్ చెప్పారు. రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నందున  తానుఇకపై ఎన్నికల్లో  పోటీ చేయబోనని ప్రకటించారు.  

రాబోయే  ఎన్నికల్లో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ప్రాంతీయ పార్టీల మధ్యే పోటీ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. తమిళనాడు రాష్ట్రంలో మాదిరిగా  జాతీయపార్టీలు,  ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ ఉండదన్నారు.హర్షకుమార్ , ఉండవల్లి అరుణ్ కుమార్ లు ఏ పార్టీ తరపున పోటీ చేసినా  వారికి   తాను మద్దతిస్తానని  లగడపాటి రాజగోపాల్ వివరించారు.
 

click me!