బీజేపీతో టీడీపీ లింక్స్: జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published Oct 16, 2019, 1:51 PM IST
Highlights

ఏపీ రాష్ట్ర రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటు చేసుకొనే అవకాశాలు కన్పిస్తున్నాయి. మాజీ ఎంపీ జేసీ దిావాకర్ రెడ్డి వ్యాఖ్యలు కొత్త సమీకరణాలకు నాంది పలికే అవకాశాలున్నట్టుగా కన్పిస్తున్నాయి.

అనంతపురం:  భవిష్యత్తులో  టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయవచ్చని అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి  అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ, శాశ్వత శత్రువులు కాని ఉండరని ఆయన తేల్చి చెప్పారు.

బుధవారం నాడు ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌తో జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడారు. ఏపీ రాష్ట్రంలో  వైఎస్ జగన్ ను గెలిపించడం వెనుక మోడీ తంత్రం ఉందని  ఆయన చెప్పారు.  వైసీపీకి చెందిన అభ్యర్ధులు స్వల్ప మెజారిటీతో విజయం సాధించలేదన్నారు.

 అనామకమైన అభ్యర్ధి కూడ భారీ మెజారిటీతో విజయం సాధించారని  ఆయన గుర్తు చేశారు.  ఒక్కో అభ్యర్ధి వేలాది ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం వెనుక మోడీ తంత్రం ఉందన్నారు. 

రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని ఆయన తేల్చిచెప్పారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ, శాశ్వత శత్రువులు కానీ ఉండరని ఆయన చెప్పారు. ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా  లు మంచి వ్యూహాకర్తలుగా జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు.

చంద్రబాబునాయుడు కూడ ఇదే కోవలోకి వస్తారని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీడీపీకి బీజేపీ తలుపులు మూసివేసిందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతోందో చెప్పలేమన్నారు. 

చంద్రబాబునాయుడు ఎవరి జుట్టు పట్టుకొండాడో ఇంకేం చేస్తారో తెలియదన్నారు. రానున్న రోజుల్లో  బీజేపీతో కలిసి పోటీ చేసే అవకాశాన్ని కొట్టిపారేయలేమని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు.

కమ్యూనిష్టు పార్టీలు అధికారంలో ఉన్న కేరళ లాంటి రాష్ట్రంలో కూడ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేదుప కానీ, ఏపీ రాష్ట్రంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు.  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనీ చేయాలని తెలంగాణ రాష్ట్రంలో కార్మికులు సమ్మె చేస్తున్నారని ఆయన చెప్పారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఇతర రాష్ట్రాల్లో కూడ ఉద్యమాలు వచ్చే అవకాశాలను కొట్టిపోరేయలేమని  జేసీ దిావాకర్ రెడ్డి అబిప్రాయపడ్డారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడ ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆందోళన చేసే అవకాశాలు లేకపోలేదని జేసీచెప్పారు. 

రివర్స్ టెండరింగ్ వల్ల సకాలంలో పనులు పూర్తైతే ప్రయోజనం ఉంటుందన్నారు. అయితే సకాలంలో పనులు పూర్తవుతాయా లేదా అనేది ఆచరణలో తేలనుందని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో  ఆ తర్వాత టీడీపీలో చేరిన తర్వాత కూడ జేసీ దివాకర్ రెడ్డి తన మనసులో భావాలను కుండబద్దలు కొట్టేవారు. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి తనయుడు పవన్ కుమార్ రెడ్డి, జేసీ సోదరుడు ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి నుండి పోటీ చేశారు. వీరిద్దరూ కూడ ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. తమ వారసులను రాజకీయాల్లో చూడాలనుకొన్న జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలకు నిరాశే ఎదురైంది.


 

click me!