చంద్రబాబు సేవ కోసమే జనసేన: పవన్ పై పేర్ని నాని ఫైర్

Published : Mar 14, 2023, 09:28 AM ISTUpdated : Mar 14, 2023, 09:35 AM IST
 చంద్రబాబు సేవ కోసమే జనసేన: పవన్ పై  పేర్ని నాని ఫైర్

సారాంశం

జనసేకు  రాజకీయ లక్ష్యం లేదని  మాజీ మంత్రి  పేర్ని నాని  విమర్శించారు. చంద్రబాబుకు భజన చేసేందుకు  పవన్  కళ్యాణ్  ఇవాళ  బందర్  సభ  ఏర్పాటు  చేశారన్నారు. 

అమరావతి: చంద్రబాబుకు సేవ చేసేందుకు  పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు  చేశారని మాజీ మంత్రి  పేర్ని నాని  విమర్శించారు. మంగళవారంనాడు ఆయన  అమరావతిలో  మీడియాతో మాట్లాడారు.  చంద్రబాు మేలు కోసమే పవన్ కళ్యాణ్  రాజకీయాలు చేస్తున్నారన్నారు.  వైఎస్ జగన్ ను తిట్టేందుకే  జనసేన ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నారని  పేర్ని నాని  అభిప్రాయపడ్డారు.

వైఎస్ జగన్ ను తిట్టడమే తప్ప పవన్ కళ్యాణ్ కు  వేరే  ఎజెండా లేదన్నారు. పవన్ రాజకీయ ఆవిర్భావ  సభకు  ఎలాంటి ఎజెండా లేదని  పేర్ని నాని  చెప్పారు.  చంద్రబాబును విమర్శించే వాళ్లను తిట్టడానికి బందరులో ఇవాళ పవన్ కళ్యాణ్ సభ పెట్టారని  పేర్నినాని  విమర్శించారు.  కాపులను  చంద్రబాబుకు తాకట్టు పెట్టేందుకు  ప్రయత్నం  చేస్తున్నారన్నారు.  పవన్ కళ్యాణ్ మారే పరిస్థితి లేదన్నారు. 

భవిష్యత్తు  కార్యాచరణపై రాజకీయ పార్టీకి లక్ష్యం ఉండాలన్నారు.  కానీ  పవన్ కళ్యాణ్  పార్టీకి  ఎలాంటి  లక్ష్యం లేదని  నాని   చెప్పారు. వైసీపీలోని  కాపు సామాజిక వర్గానికి  చెందిన  నేతలను  లక్ష్యంగా  చేసుకొని  బూతులు మాట్లాడడమే పవన్ కళ్యాణ్  ఏకైక లక్ష్యంగా  మాజీ మంత్రి  పేర్కొన్నారు.  

also read:చంద్రబాబు బాగుండాలనేదే పవన్ లక్ష్యం.. ఆయనను ప్రజలు ఎందుకు నమ్మాలి?: పేర్ని నాని

ఇవాళ మచిలీపట్టణంలో  జనసేన ఆవిర్భావ  సభను  నిర్వహిస్తున్నారు.  ఇవాళ  మధ్యాహ్నం  మంగళగిరి  పార్టీ కార్యాలయం నుండి  పవన్ కళ్యాణ్  ర్యాలీగా  మచిలీపట్టణానికి  బయలుదేరుతారు.  అయితే  బైక్ ర్యాలీకి  అనుమతి లేదని  పోలసులు  ప్రకటించారు. ఈ మేరకు  జనసేన నేత మహేష్ కు  పోలీసులు సోమవారంనాడు రాత్రి  నోటీసులు అందించారు.  

పవన్ కళ్యాణ్  విమర్శలకు  వైసీపీ తరపున  మాజీ మంత్రి  పేర్ని నాని ఘాటుగా  స్పందింస్తున్నారు.  నాని ప్రాతినిథ్యం వహిస్తున్న  మచిలీపట్టణం నియోజకవర్గంలో  ఇవాళ జనసేన ఆవిర్భావ సభను  నిర్వహిస్తున్నారు. ఈ సభలో  పవన్ కళ్యాణ్  ఏం చెబుతారనేది  ఆసక్తికరంగా  మారింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

YS Jagan Flags Off Vehicles to Lok Bhavan | Crore Signatures Paper Transfer | Asianet News Telugu
BR Naidu Press Meet: దేశం లోనే అత్యుత్తమ ఆసుపత్రిగా తిరుపతి స్విమ్స్: బీఆర్ నాయుడు| Asianet Telugu