
ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేటలో అంగన్వాడీ కేంద్రాలను ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి (Chitha Vijay Prathap Reddy) సందర్శించారు. రికార్డులు తనిఖీ చేసి పిల్లలు, బాలింతలు, గర్భిణులకు అందుతున్న పోషకాహారంపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతో మాట్లాడి వారి తెలివిని చూసి మెచ్చుకొన్నారు. అంగన్వాడీ కార్యకర్త పనితీరును అభినందించారు.